పక్షవాతానికి కొత్త ట్రీట్‌మెంట్


Tue,October 29, 2019 12:33 AM

Therapy
2014 వ సంవత్సరం పక్షవాతం చికిత్సను కొత్త పుంతలు తొక్కించింది. పక్షవాతానికి గురైన పేషెంట్లకు అధునాతనమైన చికిత్సా పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. అదే.. థ్రాంబెక్టమీ. జనరల్ అనెస్తీషియా అవసరం లేని సర్జరీ ఇది. కేవలం లోకల్ అనెస్తీషియాతో పక్షవాతం వచ్చిన 24 గంటల్లోగా ఈ థ్రాంబెక్టమీ చేస్తే మంచి ఫలితాలుంటాయి.


పక్షవాతంతో పోలిస్తే గుండెపోటు నుంచి బయటపడడం చాలా సులువు. గుండె ఎక్కడుంటుందో గుండెపోటు లక్షణాలు కూడా అక్కడే ఉంటాయి. కాని మెదడులో సమస్య వల్ల ఏర్పడే పక్షవాతం లక్షణాలు ఏ కాళ్లూ చేతుల్లోనో కనిపిస్తాయి. అందుకే పక్షవాతాన్ని తొందరగా గుర్తించలేకపోతారు. అంతేకాదు.. గుండెపోటుకు ఒక్క ఇసిజి చూసి అవసరమైన ట్రీట్‌మెంట్ కు సిద్ధం కావొచ్చు. కాని పక్షవాతం ఉన్నప్పుడు దానికి సిటి ఆంజియోగ్రామ్, సిటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ ఆంజియోగ్రామ్, ఎంఆర్‌ఐ స్కాన్ చేస్తారు. వీటిలో ఏ రకమైన పక్షవాతం అనేదే కాకుండా, ఎంత నాడీ కణజాలం ప్రభావితం అయ్యిందనే విషయం కూడా తెలుస్తుంది. వీటిద్వారా సమస్యను పూర్తిగా నిర్ధారించి, దానికి అనుగుణమైన చికిత్స చేస్తారు.

సర్జరీ ఏంటి?

సాధారణంగా స్ట్రోక్ వస్తే ప్రతి పది మందిలో నలుగురికి ఇంజెక్షన్ అవసరమైతే ఇద్దరికి సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ అనగానే ఇదేదో పెద్ద కోత పెట్టి చేసే ఆపరేషన్ అని భయపడనక్కర్లేదు. కాలి రక్తనాళం ద్వారా కెథటర్ గుండా స్ట్రెంట్ రీవర్ అనే పరికరాన్ని క్లాట్ దగ్గరికి పంపించి, దాన్ని తొలగించడమే ఈ సర్జరీ. దీన్ని థ్రాంబెక్టమీ అంటారు. రోగి తొడ భాగంలో చిన్న కోత పెట్టి ఆస్టిక్ ఫైబర్ కేబుల్‌ను రక్తనాళం గుండా మెదడులో మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సున్నితమైన గొడుగు లాంటి స్టెంట్ రీవర్‌ను కెథటర్ గుండా పంపిస్తారు. మెదడు రక్తనాళంలో పూడిక ఉన్న చోట స్టెంట్ రీవర్ గొడుగు లాగా తెరుచుకుని అక్కడ అడ్డంగా ఉన్న గడ్డను తనలోకి లాగేసుకుంటుంది. అప్పుడు దాన్ని బయటకు లాగేస్తారు. ఇలా రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ తొలగిపోవడంతో రక్తప్రసరణ సాఫీగా కొనసాగుతుంది.
Therapy1

సర్జరీ.. ఎప్పుడవసరం?

-రక్తనాళంలో చిన్న చిన్న గడ్డలు లేదా క్లాట్స్ ఏర్పడినప్పుడు చేతికి ఇంజెక్షన్ ఇస్తే అవి కరిగిపోతాయి. కాని పెద్ద రక్తనాళంలో ఏర్పడే పెద్ద పెద్ద క్లాట్స్‌ను కరిగించాలంటే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్‌తో పాటు సర్జరీ కూడా అవసరం అవుతుంది.
-పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల తర్వాత హాస్పిటల్‌కి వచ్చినా సర్జరీ అవసరం అవుతుంది.
-ఇంజెక్షన్ ఇవ్వలేని పరిస్థితులున్నవాళ్లకి కూడా సర్జరీ అవస రం అవుతుంది. అంటే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ లాంటి మం దులు తీసుకున్నవాళ్లు, అంతకుముందు నెలలోపు సర్జరీ అయినవాళ్లు, ఇటీవలే స్ట్రోక్ వచ్చినవాళ్లకు థ్రాంబోలైటిక్ థెర పీ చేయలేము. ఇలాంటివాళ్ళకు థ్రాంబెక్టమీ సర్జరీ చేస్తారు.
-సాధారణంగా స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల్లోగా థ్రాంబోలైటిక్ థెరపీ తీసుకోవాలి. ఏ కారణం చేతనైనా హాస్పిటల్‌కి రావడం ఆలస్యం అయినవాళ్లకు ఈ థ్రాంబెక్టమీ మరో దారి చూపిస్తుంది. ఈ సర్జరీని పక్షవాతం వచ్చిన 24 గంటల్లోగా చేయవచ్చు.
-ఒకసారి థ్రాంబెక్టమీ చేసిన తరువాత మళ్లీ తరువాత అవసరమైతే.. ఇలా ఎన్నిసార్లయినా చేయొచ్చు.
-సర్జరీ తరువాత 5 నుంచి 20 శాతం మందిలో బ్రెయిన్ లో వాపు రావొచ్చు. వారికి ఓపెన్ సర్జరీ అవసరం పడొచ్చు.
Suresh

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles