అమ్మాయిలు ఎవరిని ఇష్టపడుతారు?


Wed,October 23, 2019 01:51 AM

అమ్మాయిలు ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు? ఎలాంటి మనస్తత్వం ఉన్నవారిని ఇష్టపడుతారు? ఎలాంటి వారికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? ఇలా పలు అంశాలపై ఇటీవల ఓ సర్వే జరిగింది. ఆ సంస్థ అమ్మాయిల మనసుల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
YOUTH
అమెరికాకు చెందిన పీపుల్స్ మ్యాగజైన్ ఇటీవల ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాలకు చెందిన యువతులు, మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17 నుంచి 40 ఏళ్లలోపు ఆడవారు ఈ సర్వేలో పాల్గొన్నారు. మగవారిలో ఏ విషయాలను చూసి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. అంటూ వారిని ప్రశ్నించిన సమయంలో అందం అనే సమాధానాన్ని చాలా తక్కువ మంది చెప్పారట. ఎక్కువశాతం ఆడవారు మగవారిలోని సెన్సాఫ్ హ్యూమర్, మాట్లాడే చతురతను బట్టి ఇష్టపడుతున్నారట. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎంత తెలివి ఉన్నా, అందంగా ఉన్నా.. ఎంత సంపాదిస్తున్నా మగువలు ఇష్టపడట్లేదట. మంచి మాటకారితనం, ఎంటర్‌టైన్ చేసే వ్యక్తిత్వం ఉన్నవారినే యువతులు ఇష్టపడతారని సర్వేలో వెల్లడైంది. అమ్మాయిల దృష్టిలో పడాలంటే కేవలం అందంగా ఉంటే సరిపోదని, మొహంపై ఎప్పుడూ నవ్వు ఉండాలని సర్వేలో వెల్లడైంది. చలాకీగా ఉంటూ నవ్విస్తూ ఉండేవారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.

823
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles