బగ్ కనిపెట్టు.. బహుమతి పట్టు


Wed,October 23, 2019 01:50 AM

bug
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్నట్టు ఏ యాప్‌లో ఎలాంటి బగ్ ఉందో ఎవరు కనిపెట్టగలరు.. ఇలాంటి బగ్‌లతోనే హ్యాకర్ల యాప్‌ల ద్వారా యూజర్ డేటాను హ్యాక్ చేస్తారు. ఎప్పుడైనా ఓ కంపెనీ కొత్త యాప్‌ను లాంచ్ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా టెస్టింగ్ చేసి విడుదల చేస్తుంది. కానీ కొన్నిసార్లు వారికి తెలియకుండానే బగ్స్ రహస్యంగా యాప్‌లోకి వస్తాయి. అలాంటి బగ్‌లను కనిపెట్టి కంపెనీకి చెప్తే భారీ నజరాన మీ సొంతం అవుతుంది. సరిగ్గా ఇలాగే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ హ్యాకర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.


బగ్ బౌంటీ ప్రోగ్రామ్ పేరుతో ఈ స్పెషల్ కాంటెస్టును ప్రకటించింది. థర్డ్ పార్టీ యాప్స్‌లో భద్రతాపరమైన లోపాలను గుర్తించాలని బౌంటీ పోటీదారులందరికీ కండిషన్ పెట్టింది ఫేస్‌బుక్. రియల్ టైంలోనే యాప్స్ టెస్టింగ్ చేసి అందులోని లోపాలను గుర్తించాలంటూ సవాల్ విసిరింది. ఇలా బగ్స్ కనిపెట్టిన వారికి రూ.35 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా పొందవచ్చని అంటున్నది. ఇదే కాకుండా స్థానిక యాప్స్‌లోని సెక్యూరిటీ థ్రెట్స్‌ను గుర్తించినవారికి వెయ్యి డాలర్ల నుంచి 15వేల డాలర్ల వరకు బోనస్ ఇస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది.

277
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles