పెట్స్‌ను కూడా తీసుకెళ్లండి!


Wed,October 23, 2019 01:49 AM

uber-pets
ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ఉబెర్‌లో కొత్త రైడ్ ఆప్షన్ రాబోతున్నది. Uber Pet పేరుతో రైడ్ ఫీచర్ త్వరలో రిలీజ్ కానుంది. ఇక నుంచి ట్రావెల్ చేసే సమయంలో పెంపుడు జంతువులను కూడా ఉబెర్ అనుమతించనుంది. దీంతో ప్యాసింజర్లు తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఉబెర్ పెట్ రైడ్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తున్నది. ఈ ఫీచర్ ద్వారా ముందుగానే ఉబెర్ డ్రైవర్లకు ప్యాసింజర్ల వెంట పెట్స్ ఉన్నట్టు సూచిస్తుంది. ఆస్టిన్, డెన్వర్, నాష్ విల్లే, మిన్నెపోలిస్ సేయింట్, ఫిల్లాడెల్పియా, ఫోనెక్స్, యూనైటెడ్ స్టేట్స్‌లో ఈ పెట్ రైడింగ్ ఫీచర్ టెస్టింగ్ చేయనుంది.


ఈ రీజియన్లలోని ఉబెర్ యూజర్లకు Uber Pet ఆప్షన్ అందుబాటులోకి రానుంది. అయితే.. కొత్త రైడ్ ఆప్షన్ మాత్రం ఉచితం కాదు. కొద్ది మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పెట్ రైడ్ ధర రూ.210 నుంచి రూ.350 వరకు వసూలు చేయనుంది. యూజర్ రైడ్ కంప్లీట్ కాగానే పెట్‌రైడ్‌తో కలిపి మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెస్టింగ్ చేసిన అన్ని ప్రాంతాల్లోని వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి అన్ని దేశాల్లో ఈ విధానం తీసుకురానున్నారు.

179
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles