అనాథలకూ రిజర్వేషన్ల కోసం..


Wed,October 23, 2019 01:03 AM

పాఠశాలలో చుదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయి. వీరిని పక్కనబెడితే ఏ ఆధారం లేని అనాథలకు ఎలాంటి సదుపాయం అందడం లేదు. వీరికి విరాళాలు, ఆహారం అందివ్వడం కంటే చదువు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీమ్ కోర్టును కోరుతున్నదో యువతి.
poulomi
రోజురోజుకీ అనాథ బాలికలపై లైగింక దాడులు ఎక్కువవుతున్నాయి. వీరికి 18 ఏండ్లు వచ్చే వరకు తమను తాము కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నవారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దిక్కులేని అనాథలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ పౌలోమి ప్రశ్నిస్తున్నది. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో అనాథలకు రిజర్వేషన్లు కోరుతున్నది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబిసి వర్గాల విద్యార్థులకు ఇచ్చే రాష్ట్ర స్కాలర్‌షిప్‌లు, ప్రయోజనాలను అనాథలు పొందాలని 26 ఏండ్ల పౌలోమి కోరుతున్నది. ఈమె పదేండ్ల వయసు నుంచే అనాథలతో కలిసి పనిచేస్తున్నది. పౌలోమి తల్లి ఐఎఎస్ అధికారి. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో భూకంపం సంభవించింది. అక్కడున్న అనాథలను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ అనాథాశ్రమాలలో పిల్లలను ప్రవేశపెట్టడానికి పర్యవేక్షించిన తల్లి పౌలోమిని అనాథలకు పరిచయం చేసింది. అప్పటి నుంచి పౌలోమి 11 రాష్ట్రాలలోని ఆనాథాశ్రమాలను సందర్శించింది.


వారి పరిస్థితులను డాక్యుమెంటరీ చేసింది. ఆమె ప్రయాణాలను అనుసరించి 2015 నవంబర్‌లో వీకెస్ట్ ఆన్ ఎర్త్ ఆర్పాన్స్ ఆఫ్ ఇండియా) అనే పుస్తకం రాసింది. ఈ పుస్తకానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ అమోదం కూడా అందుకున్నది. ప్రారంభంలో ప్రభుత్వాలపై పిటిషన్ వేయడానికి ప్రయత్నించాను. కాని నేను చాలా జడత్వాన్ని ఎదుర్కొన్నాను. అనాథలకు విరాళాలు, ఆహారం కాకుండా వారితో కొంత సమయం గడుపండి. నెలకు రెండుసార్లు ఆనాథాశ్రమాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. వారి చదువుకు కావాల్సిన సదుపాయాలు అందించండి. రోడ్డుపై చేయిచాచి యాచిస్తున్న పిల్లల గురించి తెలుసుకుకొని అధికారుల వద్దకు తీసుకెళ్లండి అని మౌలోని తేల్చి చెప్పింది.

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles