పర్యావరణహిత దీపావళి


Wed,October 23, 2019 12:58 AM

ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. చీకట్లు పారదోలే దీపావళి పండుగ భవిష్యత్ తరానికి చీకట్లు మిగిల్చేలా ఉండకూడదని కొంతమంది మహిళలు పర్యావరణహిత దివాళికి శ్రీకారం చుట్టారు.
eco-friendly-diwali
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళలు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందించడానికి ముందుకొచ్చారు. రాయ్‌పూర్‌లోని మారుమూల గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రకృతికి విఘాతం కలిగించని వస్తువులను తయారు చేస్తున్నాయి. గోథన్ అనే ప్రాజెక్టు ద్వారా వివిధ రకాల వస్తువులు తయాచేసి చూపించారు. ఆవుపేడ, చింతపండు, పలురకాల మూలికలను ఉపయోగించి సరికొత్త ఉత్పత్తులను అందిస్తున్నారు. ఆవుపేడతో దీపావళికి వినియోగించే 2లక్షల ప్రమిదలను తయారు చేశారు. అగర్‌బత్తులు, మొబైల్ ఫోన్ స్టాండ్లు, కీ చెయిన్ వంటి వస్తువులను అందిస్తునారు. ఆయా వస్తువుల్లో సువాసన వెదజల్లే మూలికలను ఉపయోగించారు. వారు రూపొందించిన ఉత్పత్తులను చూసిన అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే కార్యక్రమాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని 1905 గ్రామాల్లో అమలు చేశారు.


గోథాన్ ప్రాజెక్టు కింద అక్కడి మహిళలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించడంతో చాలామంది ఉపాధి పొందుతున్నారు. దశాబ్దం క్రితం రాయ్‌పూర్ ప్రాంతంలో జల వనరులు అడుగంటడంతో పంటలు పండక అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడాన్ని తమ బాధ్యతగా తీసుకున్నారు. పదేండ్ల నుంచి వారు ప్రకృతికి మేలు చేసే విధానాలనే అనుసరిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. తమ పరిసరాల్లో చెట్లు నాటుతూ అడవులను పెంచుతున్నారు.

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles