సహజసిద్ధ చర్మసంరక్షణ ఉత్పత్తులు


Sun,October 20, 2019 12:56 AM

రసాయనిక సబ్బులు వాడడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన ఓ మహిళ సహజసిద్ధమయిన సౌందర్య ఉత్పత్తులను అందించేందుకు ముందుకు వచ్చింది.
rakhi-Ghee-Soaps
మార్కెట్‌లో లభించే సౌందర్య ఉత్పత్తుల్లో పలురకాల రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి చాలామంది వివిధ చర్మరోగాల బారిన పడుతున్నారు. ఒక్క సబ్బులే కాదు. చర్మ సౌందర్యానికి సంబంధించిన అనేక ఉత్పత్తుల్లో పారాబెన్లు, ట్రైక్లోసన్, సర్ఫెక్టెంట్స్, పెట్రో కెమికల్స్ వంటి రసాయనాలున్నాయి. వీటిలో క్యాన్సర్ కారకాలున్నాయని చర్మవ్యాధుల నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించేందుకు ముంబైకి చెందిన రాఖీ అనే మహిళ శ్రీకారం చుట్టింది. సహజ సిద్ధంగా సౌందర్య ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమయింది. అందుకోసం ఆమె ఉద్యోగాన్నే వదిలేసింది. రసాయనిక సౌందర్య ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను గురించి మార్కెట్‌లో అన్వేషించింది. ఎటువంటి హాని కలిగించకుండా ఉండే సహజసిద్ధంగా లభించే ముడిసరుకులను ఉపయోగించి సబ్బులను ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నది.


దేశ, విదేశాల్లో ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలతో ఏవిధంగా చర్మసౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారో గ్రహించింది. అలా రెండేండ్లపాటు శ్రమించింది. ఓట్స్, వెన్నతోపాటు సహజసిద్ధంగా లభించే నూనెలు ఉపయోగించి చేతితోనే సబ్బులను తయారు చేయడం ప్రారంభించింది. ఆమె రూపొందించిన సబ్బులను తన మూడేండ్ల కుమారునికి వాడి చూసింది. ఆ తర్వాత లిప్‌బామ్, మాయిశ్చరైజింగ్ క్రీములు, పలురకాల లోషన్లను తయారు చేయడం మొదలు పెట్టింది. వాటిని తన దగ్గరి బంధువులు, స్నేహితులకు పంపించింది. వారి నుంచి మంచి స్పందన రావడంతో ద గ్రీన్ సెజ్ పేరుతో నాణ్యమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందిస్తున్నది.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles