జంతువులు ఆరోగ్యాన్నిస్తాయి!


Mon,October 14, 2019 01:43 AM

dogs1
కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు. దాన్ని అలా నిమురుతుంటే ఒత్తిడి మాయం అవుతుందని చాలామంది అంటుంటారు. ముఖ్యంగా ఆఫీస్ ఒత్తిడిని అధిగమించడానికి ఇంట్లోని పెంపుడు జంతువు ఉపయోగపడుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే పెంపుడు జంతువులు లేనివారు సమస్యలను అధిగమించడానికి ఎనిమల్ ఏంజిల్స్‌కు వెళ్లాల్సిందే..


పెంపుడు జంతువులతో చాలా ఉపయోగాలున్నాయి. అవి ఇంటికి కాపలా మాత్రమే కాకుండా తోడుగా కూడా ఉంటాయి. అంతేకాదు వీటితో కొంత సమయం గడిపితే చాలు డిప్రెషన్‌ను అధిగమించవచ్చునని అంటున్నది ఎనిమల్ ఏంజిల్స్ ఫౌండర్ మినాల్ కవిశ్వార్. ఇది మానవ-పెంపుడు జంతువుల పరస్పర చర్యల ప్రయోజనాలను ప్రోత్సహించడానికి భారతదేశంలో మాత్రమే నమోదు అయిన ఎన్‌జీఓ. ఈ సంస్థ పుణేలో ఉంది. ఇక్కడ కుక్కలు, చేపలు, కుందేళ్ళు ఉంటాయి. వీటితో ఒత్తిడి తగ్గించేందుకు పుణేలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నది మినాల్. డిప్రెషన్, ఆందోళన, అధిక రక్తపోటు, కండరాల, ఒత్తిడి, ఎముకల నొప్పితో బాధపడుతున్న ఎవరైనా వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు. ఎనిమల్ అసిస్టెడ్ థెరపీ(ఏఏటీ) ప్రయోజనాలను పరిశోధించిన తర్వాత 2003లో కవిశ్వర్ ఈ సంస్థను ప్రారంభించింది.
dogs
అంగవైకల్యం ఉన్న పిల్లలు, సెరిబ్రల్ పాల్సీతో బాధపడేవారు ఏఏటీ అసాధారణ చికిత్సల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని అంటున్నది. కుక్కలను పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటివారు కుందేళ్లను ఎంపిక చేసుకోవచ్చు. పెంపుడు జంతువులపై ఉన్న అపోహలన్నింటినీ తొలిగించి వర్క్‌షాప్‌కు రావాలంటున్నది. కొంతమంది వలంటీర్లు మానవ-జంతువుల మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ వివరిస్తారు. మొదటి భాగంలో కుందేళ్లు, చేపలను పరిచయం చేస్తారు. బ్రేక్ తర్వాత థెరపీ కుక్కలను పరిచయం చేస్తామంటున్నది కవిశ్వర్.

358
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles