క్యాన్సర్ బాధితులకు చేయూత


Thu,October 3, 2019 12:58 AM

డాక్టర్ నోర్డన్ కిట్టు తన జీవితాన్ని క్యాన్సర్ బాధితులకు రక్షణగా అంకితం ఇచ్చాడు. క్యాన్సర్‌తో తల్లిని కోల్పోయిన నోర్డన్ ఇంకా ఎవరూ అలా మృతి చెందొద్దని క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి రక్షణగా నిలుస్తున్నారు.
cancer-doctor
తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో నోర్డన్ వైద్యునిగా పని చేసే సమయంలో లడఖ్‌లోని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి మృతిచెందినట్టు తెలిసింది. ఇది నోర్డన్‌ను బాధించింది. మరోసారి నోర్డన్ పని చేస్తున్న గ్రామంలో ఓ మహిళ క్యాన్సర్‌తో బాధపడడాన్ని చూశాడు. విరాళాలు సేకరించి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆమె ప్రాణాలు నిల్వలేదు. దీంతో నోర్డాన్ నిర్ణయించున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలందరికీ సాయం చేయాలనుకున్నారు. అవసరమైన వైద్య చికిత్సలు అందించాలనుకున్నాడు. తిరిగి లఢఖ్ వెళ్లి హిమాలయా ఉమెన్ హెల్త్ ప్రాజెక్ట్ చేపట్టారు. స్థానికంగా ఉండే మహిళా క్యాన్సర్ బాధితులను చేరదీసి ఆరోగ్యసేవలు ప్రారంభించారు. త్రీవస్థాయిలో క్యాన్సర్ ఉంటే విదేశీ డాక్టర్లను రప్పించి చికిత్స అందించారు. 2010లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 10 వేల మందిని నోర్డన్ బృందం పరీక్షించింది. వెయ్యి మందికి ముందస్తు గాయాలను గుర్తించి చికిత్స అందించారు. వాటిని నయం చేయడానికి స్క్రీన్ అండ్ ట్రీట్ విధానాన్ని ఉపయోగించారు. నొప్పి లేకుండా వాటిని నయం చేసినట్టు బృందంలోని సింగపూర్‌కు చెందిన గైనకాలజిస్టు కూక్ స్వీచోంగ్ చెప్పారు. ఇట్లా హెల్త్ క్యాంపే కాకుండా.. లడఖ్‌లోని పొగాకు నివారణ కార్యక్రమం ద్వారా పొగాకు లేని లడఖ్ కోసం పాటుపడుతున్నారు.

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles