కుర్రకారు చూపు.. పాతకారు వైపు


Wed,October 2, 2019 01:09 AM

youth--car
యువతకు ఇష్టమైన వాహనమంటే ఒకప్పుడు బైక్‌. ఇప్పుడు కారు. అందులోనూ తక్కువ ధరలో కారొస్తే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం కొత్త కార్ల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా యువత పాతకార్లను ఇష్టపడుతున్నది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. ఇంతకీ ఆ సర్వే వివరాలేంటంటే..


కొత్త కార్ల సేల్స్‌ ఢమాల్‌ అంటున్నాయి. పాత కార్ల సేల్స్‌ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రీ ఓన్డ్‌ కార్ల సేల్స్‌ ఈ సంవత్సరానికి గాను ఏకంగా 10శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ ఓఎల్‌ఎక్స్‌ పేర్కొంది. ఇండియాలో ఈ ఏడాది చివరినాటికి పాత కార్ల సేల్స్‌ దాదాపు 44 లక్షలు దాటే వీలుందని సంస్థ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా యువత ప్రీ ఓన్డ్‌ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నదని సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇండియాలోని 1500 మంది యువకులపై ఓఎల్‌ఎక్స్‌ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కారు కొనాలనుకుంటున్నారా? కొత్తదా పాతదా? పాత కారు ఎందుకు కొనాలనుకుంటున్నారు? వంటి అంశాలపై సర్వే నిర్వహించింది. కొత్త కార్ల ధరలు పెరిగాయని, పాత కారైతే సగం ధరకు వస్తుందని యువత నుంచి సమాధానం వచ్చింది. సెకండహ్యాండ్‌ కార్లు కొన్నా వాటికి ఇన్సూరెన్స్‌ వస్తుండడం అదనపు ప్రయోజనంగా యువత చెప్పుకొచ్చింది.

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles