క్రోమ్‌ కొత్త ఫీచర్లు


Wed,October 2, 2019 01:06 AM

Google-Chrome
గూగుల్‌... క్రోమ్‌ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్లను చేర్చింది. సులభతరమైన బ్రౌజింగ్‌కు ఇవి మరింత ఉపయోగకరంగా ఉన్నాయి.


క్రోమ్‌లో సమాధానాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి సెర్చ్‌ చేయాల్సిన పని లేకుండానే మన గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ అడ్రస్‌ బార్లో ప్రశ్న టైప్‌ చేసేటప్పుడు దాని సమాధానం కూడా కనిపిస్తుంది. మీ ఫోన్లో బ్రౌజర్‌లో వెబ్‌పేజీని ఇతరులతో షేర్‌ చేసుకోవడం కోసం షేర్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నప్పుడు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఇతర అంశాలతోపాటు తాజాగా సెండ్‌ యువర్‌ డివైజ్‌ అనే కొత్త ఆప్షన్‌ కూడా లభిస్తుంది. మీ గూగుల్‌ అకౌంట్‌తో లాగిన్‌ అయి ఉండి, ప్రస్తుతం ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యి ఉన్న డివైజ్‌లకు వెబ్‌పేజీని షేర్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ బ్రౌజర్‌లో ట్యాబ్‌ గ్రిడ్‌ ఫీచర్‌ వచ్చింది. అనేకంగా తెరిచి ఉన్న ట్యాబ్‌లను గ్రిడ్‌ రూపంలో చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఇది కేవలం థర్డ్‌-పార్టీ థీమ్‌లను మాత్రమే సపోర్ట్‌ చేసేది. కానీ ఇకపై థీమ్‌ కస్టమైజ్‌ చేసుకునే విధంగా సపోర్టు కూడా ప్రవేశపెట్టారు. డెస్క్‌టాప్‌ యూజర్లు ఒకేసారి పలు టాబ్స్‌ ఓపెన్‌ చేసి ఉన్నప్పుడు, కేవలం వాటి ఐకాన్స్‌ చూపించడం కాకుండా, ఆయా వెబ్‌సైట్స్‌ పేర్లు కూడా మౌస్‌ పెట్టినప్పుడు చూపించే విధంగా ఒక సరికొత్త ఆప్షన్‌ కూడా వచ్చింది.

256
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles