డిలిట్‌ చేసిన మెసేజ్‌లు చూడాలా?


Wed,October 2, 2019 01:04 AM

wtsp
కొంత కాలం కిత్రం వాట్సాప్‌లో వచ్చిన ఫీచర్‌ ‘డిలిట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌'. మెసేజ్‌ చేసిన తర్వాత దాన్ని ఇద్దరికీ డిలిట్‌ చేసుకోవడానికి వీలుంది. ఇట్లా ఇవరైనా మీకు మెసెజ్‌ పెట్టి దాన్ని డిలిట్‌ చేస్తుంటారు. అదేంటో ఎలా తెలుసుకోవాలంటే ఈ ట్రిక్‌ ఉపయోగించండి..


వాట్సాప్‌లో మెసెజ్‌ డిలిట్‌ అయితే అది ఏంటో అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. వాటి తెలుసుకోవడానికి థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ను వాడొచ్చు. వాట్సాప్‌ డిలిట్‌ చేసిన మెసేజ్‌లకు, వీటికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఆ డిలిట్‌ వాట్సాప్‌కు వచ్చిన నోటిఫికేషన్స్‌ అంటే మెసేజ్‌లు అన్నీ ఇవి సేవ్‌ చేసుకుంటాయి. అంటే ఎవరైనా మెసెజ్‌ చేస్తే అది వాట్సాప్‌నకు నోటిఫికేషన్‌ రూపంలో వస్తుంది. ఈ నోటిఫికేషన్లు ముందే ఈ థర్డ్‌పార్టీ అప్లికేషన్‌లో సేవ్‌ అవుతూ ఉంటాయి. కాబట్టి వాట్సాప్‌లో మెసేజ్‌ డిలిట్‌ చేసినప్పటికీ ఆ మెసెజ్‌ నోటిఫికేషన్‌ ఈ యాప్‌లో సేవ్‌ అయి ఉంటుంది కాబట్టి అక్కడ అదేంటో చూడొచ్చు. ‘సేవ్‌ నోటిఫికేషన్‌' పేరుతో థర్ట్‌పార్టీ యాప్‌లు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. యాప్‌ ఫీచర్లను బట్టి వాట్సాప్‌లో స్టేటస్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

715
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles