వాడిన టైర్లతో కుండీలు!


Sat,September 21, 2019 12:50 AM

గతేడాది కేరళను వర్షాలు ముంచెత్తాయి. వరదల అనంతరం కేరళలో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ పేరుకుపోయింది. సర్వం రూపం కోల్పోయినా.. ప్లాస్టిక్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రిటైర్డ్ శాస్త్రవేత్త ప్లాస్టిక్‌ను కరిగించే పనిలో పడ్డారు. వాడిన టైర్ల ద్వారా కుండీలను తయారు చేస్తున్నారు.
scientist
కేరళకు చెందిన విశ్రాంత శాస్త్రవేత్త రోహిణి. ఆమె భర్త ఆర్డీలైయ్యర్. వీరు 2007 వరకు కేరళలో ఉన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం తమిళనాడుకు వెళ్లారు. అక్కడ నవశక్తి అనే స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా స్థానిక రైతులకు ఉచితంగా నారును అందించేవారు. ఎక్కువ పంట దిగుబడి వచ్చేలా అవగాహన కల్పించేవారు. కేరళను వరదలు ముంచెత్తిన అనంతరం అక్కడ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. వినియోగాన్ని ఎలాగూ ఆపలేం.. కనీసం వాడిన ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలి. అనుకున్నారు. అందుకోసం కొట్టాయంలోని రబ్బర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఆర్‌ఆర్‌ఐ)ను సంప్రదించారు. పెన్షన్ డబ్బు లక్ష రూపాయలతో చిన్న స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇదివరకే వాడిన టైర్లను పూల కుండీలుగా మార్చడంలో విజయం సాధించారు. ఒక్కో కుండీ 750 గ్రాముల బరువుతో ఉంటుంది. కనీసం 8 నుంచి 9 సంవత్సరాల దాకా వాడుకోవచ్చు. ఒక్కో కుండీ రూ.340కి అమ్ముతున్నారు. వాడిన టైర్లను రీసైకిల్ చేస్తున్నారు. ఇప్పటివరకు 1500 కుండీలను విక్రయించారు.
Rubber-pot

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles