ముచ్చటగా మూడు ప్రాజెక్టులు


Sat,September 21, 2019 12:30 AM

giridhari
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్దేశించుకున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగళూరు జాతీయ రహదారి మీద వేదాంత, గ్రీన్‌ కౌంటీ, వికారాబాద్‌ లో నిర్వానా అనే గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్లను ప్రారంభించింది.


మహబూబ్‌నగర్‌లో పోలెపల్లి ఎస్‌ఈజెడ్‌, దివిటిపల్లి ఐటీ హబ్‌లను దృష్టిలో పెట్టుకుని 26 ఎకరాల్లో ‘వేదాంత’ అనే ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్‌కు గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ శ్రీకారం చుట్టింది. భూత్పూర్‌ మున్సిపాలిటీలో గల అమిస్తాన్‌పూర్‌ వద్ద ‘గ్రీన్‌ కౌంటీ’ అనే ప్రాజెక్టును ఆరంభించింది. ఇక, హైదరాబాద్‌ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో గల వికారాబాద్‌లో ‘నిర్వానా’ విల్లా ప్లాట్ల ప్రాజెక్టును మొదలెట్టింది. డీటీసీపీ అనుమతితో దాదాపు పన్నెండు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ వెంచర్‌లో ప్లాటు సైజు 160 గజాల నుంచి ప్రారంభమవుతుంది. హండ్రెడ్‌ పర్సంట్‌ వాస్తుకు అనుగుణంగా డెవలప్‌ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రహదారులన్నీ 40 అడుగులవి కావడం గమనార్హం. ఇందులో ప్లాటు కొనుక్కుంటే ఎంచక్కా మీకు నచ్చినట్టు విల్లా కూడా కట్టుకోవచ్చు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రియల్‌ రంగం పరుగులు పెడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల సాగునీటి, హైదరాబాద్‌ వాసుల తాగునీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఇదే అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు.

266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles