లెహంగా.. కళ్లు చెదరంగా!


Fri,September 20, 2019 01:27 AM

ఏ ఇంట పెండ్లి సందడి మొదలైనా.. ఏ కాలేజ్‌లో ఫంక్షన్ జరిగినా.. మగువల మనసులు లాగేది.. లెహంగాల వైపే.. హంగామా రెండింతలు కావాలంటే.. కళ్లు చెదిరే లెహంగాలు వేయాల్సిందేనంటున్నారు.. ఎన్ని ఫ్యాబ్రిక్‌లు ఉన్నా.. నెట్.. రాసిల్క్..
వీటికే మా ఓటు అంటున్నారు.. అందుకే ఆ ఫ్యాబ్రిక్స్‌తో కుట్టిన లెహంగాలే ఇవి..

Fashan
1. బ్లూ కలర్ రాసిల్క్‌ని ఫుల్ కలీస్‌తో డిజైన్ చేశాం. లెహంగా మొత్తం సీక్వెన్స్ వర్క్‌తో పువ్వుల డిజైన్ బుటీస్ ఇచ్చాం. బార్డర్‌గా సీక్వెన్స్ వర్క్ చేశాం. దాని పైన జర్దోసీ, సీక్వెన్స్ వర్క్‌తో పెద్ద పెద్ద బంచెస్ వీటికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. బ్లూ కలర్ బ్లౌజ్ మీద కూడా లెహంగా మీద వర్క్‌తోనే ఫుల్‌గా నింపేశాం. పీచ్ కలర్ సాఫ్ట్ నెట్ దుపట్టా మీద సీక్వెన్స్ బుటీస్ ఇచ్చాం. సీక్వెన్స్, జర్దోసీతో బార్డర్ చూడముచ్చటగా కనిపిస్తున్నది.


2. సింపుల్ అండ్ స్వీట్‌గా కనిపించేందుకు ఈ లెహంగా ఎంచుకోవాల్సిందే! పేస్టల్ గ్రీన్ కలర్ నెట్ లెహంగా ఇది. దీనికి బెల్ట్‌లా రాసిల్క్ మీద జర్దోసీ, థ్రెడ్ వర్క్, సీక్వెన్స్, కట్‌దానా వర్క్‌తో నింపేశాం. పింక్ టస్సెల్స్ దీనికి అదనపు ఆకర్షణ. రాసిల్క్ బ్లౌజ్ మీద హెవీగా థ్రెడ్‌వర్క్, జర్దోసీ, సీక్వెన్స్ వర్క్‌తో నింపేశాం. పింక్ నెట్ దుపట్టా మీద సీక్వెన్స్ బుటీస్‌తో పాటు, సీక్వెన్స్ బార్డర్‌ని ఇవ్వడంతో సూపర్‌గా మెరిసిపోతున్నది.

3. యెల్లో కలర్ నెట్ లెహంగా మీద సీక్వెన్స్‌తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చాం. రాసిల్క్ బ్లౌజ్ మీద థ్రెడ్, మిర్రర్, కట్‌దానా వర్క్‌తో నింపేశాం. పింక్ కలర్ నెట్ దుపట్టా మీద సీక్వెన్స్, ముత్యాలు, జర్దోసీతో హెవీగా బుటీస్ ఇచ్చాం. కట్ వర్క్‌తో వచ్చిన గోల్డెన్ బార్డర్ దీనికి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. లెహంగాకి ఇచ్చిన పింక్ టస్సెల్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
Fashan1
4. బుట్టబొమ్మలా కనిపించాలంటే ఈ డ్రెస్ మీకు పర్‌ఫెక్ట్. పీచ్ కలర్ నెట్ లెహంగా ఇది. దీని మీద పువ్వుల్లా సీక్వెన్స్ వర్క్ చేశాం. ఇదే డిజైన్‌లా నెట్ దుపట్టాని ఇచ్చాం. పీచ్ రాసిల్క్ బ్లౌజ్ మీద మాత్రం హెవీగా మిర్రర్, గోల్డ్ జరీ, జర్దోసీ, థ్రెడ్ వర్స్‌తో రిచ్‌గా డిజైన్ చేశాం. తామరపూల డిజైన్ బ్లౌజ్ మీద ప్రత్యేకంగా కనిపిస్తున్నది.

5. ఎర్రని రాసిల్క్ కలీస్ లెహంగా ఇది. దీని మీద సీక్వెన్స్‌తో పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చాం. సిల్వర్ యాంటిక్ జర్దోసీతో, గోల్డ్ సీక్వెన్స్‌తో హెవీగా బార్డర్ ఇచ్చాం. ఎర్రని రాసిల్క్ బ్లౌజ్ మీద ముత్యాలు, సిల్వర్ యాంటిక్ జర్దోసీతో నెక్‌లైన్, స్లీవ్స్ హెవీగా డిజైన్ చేశాం. పీచ్ సాఫ్ట్ నెట్ దుపట్టా మీద జర్దోసీ, ముత్యాలతో ఫుల్‌గా బుటీస్ ఇచ్చాం. కట్ వర్క్ బార్డర్ దుపట్టా అందాన్ని పెంచింది.

శ్వేతా రెడ్డి
ఫ్యాషన్ డిజైనర్
సితారిణి డిజైన్ స్టూడియో
బంజారాహిల్స్, హైదరాబాద్
www.sitarini.com
ఫోన్ : 97429 14002

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles