ఈ సర్జరీ ప్రమాదకరమా?


Fri,September 20, 2019 01:03 AM

నా కొడుకు వయసు 42 సంవత్సరాలు. వారం కింద కరీంనగర్‌కు పనిమీద వెళ్లి బండిమీద తిరిగి వస్తుండగా దారిలో వెనుక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. చుట్టూ ఉన్నవారు నా కొడుకుని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు పరీక్షించి, తీవ్రమైన గాయాలయ్యాయన్నారు. పెల్విక్ ఫ్రాక్చర్ అయిందన్నారు. దీనికి సర్జరీ చేయడం ప్రమాదకరమని, రిస్క్ ఎక్కువని చెప్తున్నారు. నాకు సరైన మార్గం తెలుపగలరు.
- వీరేశం, మంచిర్యాల

iStock
మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడే పెల్విస్‌లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన గాయం. మీరు ఫ్రాక్చర్ శాతం ఏ మేరకు ఉందో తెలుపలేదు. శరీరంలోని ముఖ్యమైన అవయవాలన్నీ పెల్విస్‌లోనే ఉంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు తీవ్రంగా రక్తస్రావం అయ్యి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా పేషెంట్‌ను స్టెబిలైజ్ చేసి ఆ తరువాత సర్జరీ నిర్వహిస్తారు. ఇతర ఫ్రాక్చర్ల సర్జరీల కన్నా పెల్విక్ ఫ్రాక్చర్ సర్జరీలో రిస్క్ శాతం అధికంగా ఉన్నమాట వాస్తవమే. సర్జరీ ప్రక్రియ కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఉంటుంది. ఈ సర్జరీ అన్ని హాస్పిటల్స్‌లో అందుబాటులో లేదు. నిష్ణాతులైన వైద్యులు మాత్రమే నిర్వహించగలరు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక పార్క్ యుటేనియస్ ఫిక్సేషన్ ద్వారా సర్జరీ ప్రక్రియ సులభతరం అయింది. ఈ ప్రక్రియలో రోగికి చిన్న కోత ద్వారా సర్జరీ నిర్వహించవచ్చు. దీని ద్వారా సర్జరీ సమయంలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. అంతేగాక గాయం కూడా త్వరగా మానుతుంది. సర్జరీ అనంతరం 6 వారాల వరకు రోగికి విశ్రాంతి అవసరమవుతుంది. తిరిగి పూర్తిగా కోలుకోవడానికి 3 నెలల సమయం పడ్తుంది. మీరు నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌ను సంప్రదించండి.


డాక్టర్ అశోక్ రాజు. జి
పెల్విక్ అండ్ ట్రామా సర్జన్
సన్‌షైన్ హాస్పిటల్
సికింద్రాబాద్

1748
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles