ఆరోగ్యప్రదాయిని అరటి


Fri,September 20, 2019 01:00 AM

అరటిపండు తినడం విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఉదయం మాత్రమే తినాలని కొందరు. రాత్రి తినొద్దని ఇంకొందరు అంటుంటారు. అరటి పండు తింటే లాభాలేంటో ఎప్పుడు తింటే లాభమో తెలుసుకోండి.
Banana
-జీర్ణసంబంధమైన సమస్యలకు అరటిపండు మంచి ఔషధం. జబ్బుపడిన వాళ్లు దీన్ని తింటే త్వరగా కోలుకుంటారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
-అరటి పండులోని క్యాల్షియం, పొటాషియం మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. మన శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందాలంటే ప్రతీరోజు రెండు అరటి పండ్లు తినాలి.
-అరటిపండును పాలల్లో వేసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలుపుకొని తాగాలి. నెల రోజులు రోజూ పడుకునే ముందు తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది.
-ప్రత్యేకంగా ఈ సమయానికి అరటి పండు తినాలని ఏం లేదు. తక్షణ శక్తినిచ్చే అరటిపండును ఎప్పుడైనా తినొచ్చు. అరటి పండు తినడం వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్దకం సమస్య పరిష్కారమవుతుంది.
-ఎముకలు, కండరాల్ని బలంగా మార్చే అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రం అరటిపండు తినకపోవడమే మంచిది. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు అరటిపండ్లు తిని ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగాలి.

1189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles