ఏ బిడ్డా ప్రాణాలు కోల్పోవద్దని!


Fri,September 20, 2019 12:58 AM

ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఎవరైనా రాత్రికి క్షేమంగా రావాలనుకుంటారు. కానీ ఈ తల్లిదండ్రులు గతుకుల రోడ్డు కారణంగా వారి కూతుర్ని పోగొట్టుకున్నారు. ఇలా మరెవ్వరికీ జరుగకూడదని రోడ్లకి మరమ్మత్తులు చేస్తున్నారు. ఎంతోమందితో రోడ్లను బాగు చేయిస్తున్నారు.
arundhathi
తమిళనాడుకు చెందిన 24 ఏండ్ల అరుంధతి వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో క్లినికల్ పాథాలజీ చదువుతున్నది. రోజూ కాలేజ్‌కు బైక్‌మీద వెళ్తుండేది. ఒకరోజు గతుకుల రోడ్డు మీద వెళ్తుండగా పెద్ద ట్రక్ ఆమెను ఢీకొట్టింది. దాంతో అరుంధతి అక్కడికక్కడే మృతి చెందింది. అరుంధతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు డాక్టర్ సుభంగి, సంజయ్ తంబ్వేకర్ ఒక్కసారిగా కుంగిపోయారు. ఈ సంఘటన 2014 సెప్టెంబర్ 9న జరిగింది. రెండు నెలల తర్వాత వారి కూతురిలా మరెవ్వరూ రోడ్డు ప్రమాదంలో చనిపోకూడదని నిర్ణయించుకున్నారు ఆ తల్లిదండ్రులు. అరుంధతి ఫౌండేషన్‌ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్ పిల్లలతో హెల్మెట్ ధరించాలంటూ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు.. సంస్థలోని కొంతమంది సభ్యులతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్పించారు. ఈ విధంగా 60 పెద్దగుంతలను సరిచేశారు. అరుంధతి ఫౌండేషన్ వివిధ సామాజిక సమస్యలపై కూడా పనిచేస్తున్నది. పాథాలజీ, లాబొరేటరీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ రంగాల్లో అకాడమిక్ పనిలో రాణించడానికి, వచ్చిన వారిని గుర్తించడానికి అవార్డును ఏర్పాటు చేశారు. ఇది ప్రతీ ఏడాది నవంబర్‌లో ఇవ్వబడుతుంది. అర్హులైన మహిళా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలకు పాథాలజీ పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు.
arundhthi1

469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles