పంటినొప్పి వేధిస్తున్నదా?


Fri,September 20, 2019 12:56 AM

garlic
-జామ ఆకులను నీళ్లలో బాగా కడిగి నమిలితే పంటి నొప్పి తగ్గుతుంది. జామ ఆకుల్లో విటమిన్ బి, సి, ప్లెవనాయిడ్స్, టానిన్స్, ఐరన్, లైకోపిన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. ఇవన్నీ పంటినొప్పిని తగ్గించడంలో పనిచేస్తాయి.
-ఉప్పు కలిపిన నీటిని పుకిలించడం ద్వారా కూడా పంటి నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి, లవంగాలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుంచి వచ్చే రసం వల్ల పది సెకన్లలో నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.
-పచ్చి ఉల్లిపాయ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండడం వల్ల దానిని 3 నిమిషాలు నమిలితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
-అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరి నూనె, టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వీటినన్నింటినీ కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్స్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి దానికి చిటికెడు మెత్తని ఉప్పును కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం.

617
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles