అణువులతో చెలగాటమా?


Fri,September 20, 2019 12:54 AM

ఈనెల 26న అంతర్జాతీయ అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలనా దినోత్సవం (International Day for the Total Elimination of Nuclear Weapons) సందర్భంగా ఒక చిన్న ప్రస్తావన.
Shastreeyam
ఒకవైపు భారత్‌తో సంప్రదాయ పద్ధతిలో యుద్ధంలో గెలువకుంటే అణుయుద్ధం తప్పదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేయడం, మరోవైపు తెలంగాణలోని నల్లమల అడవులలో యురేనియం తవ్వకాల తాలూకు యత్నాలు, వాటిని వద్దంటూ ఆందోళనలు, అసెంబ్లీ తీర్మానం.. వినవస్తున్న తరుణంలోనే మరికొద్ది రోజుల్లో (సెప్టెంబర్ 26న) తత్సంబంధ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆధునిక మానవులు ఆఖరకు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకొంటారేమో అనడానికి ఈ అణువులతో చెలగాటమే ప్రత్యక్ష నిదర్శనం.


ఎదిగే మనిషి ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కావడం లేదు. ఏదైనా శాంతి- సామరస్యంగా, వినాశన రహితంగా ఉన్నంత వరకు ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, పక్కలో విషపామును పెట్టుకొంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? అణ్వస్ర్తాలు, వాటికి మూలమైన యురేనియం, ప్లుటేనియం వంటి అతివికిరణ శక్తిదాయక రసాయనిక మూలకాలే కాదు, వాటిని శుద్ధి చేయడం ద్వారా విడుదలయ్యే వ్యర్థాలుకూడా ఎంత ప్రమాదకరమో తెలిసికూడా వాటి ఉపయోగానికి సిద్ధపడుతుండడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఏదేని రెండు దేశాల నడుమ అణుయుద్ధం కనుక సంభవిస్తే ఇరుపక్షాల సైనికులతోపాటు ప్రజలూ ప్రాణనష్టానికి గురికావలసిందే కదా.

nuclear-weapon
దేశాల నడుమ తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి, పెరిగే ప్రపంచజనాభాకు కావలసినంతమేర ఇంధన అవసరాలకు అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన అణుశక్తి వనరులు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసిందిగా శాంతికాముకులు, మానవతావాదులు, ప్రకృతి ప్రేమికులు ఏండ్ల తరబడి ఘోషిస్తూనే ఉన్నారు. సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అతిప్రధాన లక్ష్యాలలో ప్రపంచ అణ్వస్ర్తాల నిరాయుధీకరణ ఒకటి. అణ్వాయుధాల ముప్పునుండి మానవజాతిని రక్షించే ఏకైక మార్గం వాటిని సంపూర్ణంగా నిర్మూలించడమేనని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా ఆయా దేశాధినేతలు, ప్రజలకు ఉద్భోదించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 అణ్వాయుధాలు మిగిలి ఉన్నట్టు ఒక అధికారిక అంచనా. మొత్తం తొమ్మిది దేశాలు (ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్థాన్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, ఫ్రాన్స్, అమెరికా, రష్యా) ప్రపంచ న్యూక్లియర్ క్లబ్‌లో సభ్యదేశాలుగా ఉంటే, అత్యధిక అణ్వస్ర్తాలను అమెరికా, రష్యాలు కలిగిఉన్నట్టు చెబుతున్నారు.

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles