మహాజల లోకాలు!


Fri,September 20, 2019 12:52 AM

బాహ్యగ్రహాలలో దాదాపు 35 శాతం అఖండమైన అఖాతాలను కలిగి ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఆ జలలోకాలు మన భూమి మాదిరిగా ఉండవని వారంటున్నారు.
Vishwa-Shodhana
గాయియా (Gaia) అంతరిక్ష ఉపగ్రహం ద్వారా లభ్యమైన సమాచార విశ్లేషణలో హార్వర్డ్ పరిశోధకులు అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఇటీవల కనిపెట్టారు. ఆ కృత్రిమ ఉపగ్రహం కనిపెట్టిన బాహ్యగ్రహాలలోని భారీవాయు గోళాలలో ప్రత్యేకించి కుబ్జగ్రహాలలో కొన్నింటి అంతర నిర్మాణాలను పరోక్ష పద్ధతిలో వారు గుర్తించారు. అవి మహాజల లోకాలు అని, కానీ మన భూమివలె మాత్రం లేవని అన్నారు. మన భూమిమీద 71 శాతం ఉపరితలాన్ని ఆక్రమించిన అఖాత జలాలు మొత్తం పృథ్వీతల ద్రవ్యరాశిలో కేవలం 0.02 శాతమే. కానీ, ఆ మహా జలలోకాలు కనీసం 25-50 శాతం మేర గ్రహ ద్రవ్యరాశి జలంతోనే నిండి ఉన్నట్టు వారు తెలిపారు. అవి అసాధారణ రీతిలో అఖండ అఖాతాలను కలిగి ఉన్నాయని, అసలు మొత్తం బాహ్యగ్రహాలలో 35 శాతం వరకు ఇలా జలలోకాలు అయుంటాయని వారన్నారు. వీటిలోని నీరుకూడా మన భూమిమీది నీటివలె పూర్తి ద్రవరూపంలో కాకుండా, ఆవిరి, మంచు రూపంలో ఉండి ఉంటుందని, వాటి ఉపరితలాలు 200-500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో మండిపోతూ నీటిఆవిరి సెగలను కలిగి ఉన్నాయని, గ్రహాల గర్భం లోపల ద్రవనీరు ఉండవచ్చునని వారన్నారు.

284
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles