బాధితులకు అండగా నిలిచింది!


Wed,September 18, 2019 12:54 AM

పెండ్లయిన ఆనందంతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన ఆమె జీవితంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. నిద్రించే సమయంలో ఆమె అందమైన ముఖం అందవికారంగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకున్నది. తనలాంటి బాధితులకు ధైర్యం చెబుతూ, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నది ఓ మహిళ.
attacked
అందమైన జీవితాల్లో వెలుగులను ఆర్పి పైశాచికత్వాన్ని పొందే మృగాలవల్ల ఎంతోమంది ఆడపిల్లలు నష్టపోతున్నారు. ప్రేమించలేదన్న కారణంతో ఆవేశంలో పశువుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు. అటువంటి అఘాయిత్యాల వల్ల ఎంతోమంది యువతులు జీవితాలనే కోల్పోవాల్సి వస్తున్నది. బెంగళూరుకు చెందిన ప్రగ్యాసింగ్‌కు పెండ్లయి 12 రోజులయింది. వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లే రైల్లో ప్రయాణమయింది. ఆ ప్రయాణమే ఆమె జీవితంలో చీకట్లు నింపింది. ప్రగ్య నిద్రిస్తుండగా ఓ యువకుడు ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. తనను కాదని మరొకరిని పెండ్లి చేసుకున్నందుకు ప్రగ్యపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత ప్రగ్యాసింగ్ కొంతకాలం బాధపడింది. ఆ బాధనుంచి ఆమె బయటపడడానికి ఐదేండ్లు పట్టింది. ఈ కాలంలో తన భర్త, కుటుంబం ఆమెకు ఎంతో అండగా నిలిచారు. ఐదేండ్ల తర్వాత.. తనలా యాసిడ్ దాడికి గురయిన బాధితులకు అండగా నిలువాలనే ఆలోచన వచ్చింది. అతి జీవన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. దేశంలోని అనేక సంస్థలు, వ్యక్తులు, స్నేహితుల నుంచి యాసిడ్ బాధితులకు సాయం అందించడానికి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించింది. అలా సమీకరించిన నిధులతో ఇప్పటివరకు 250 మందికి చికిత్స చేయించింది. వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతూ ఉపాధి కల్పిస్తున్నది. ప్రగ్యాసింగ్ సేవలను గుర్తించిన భారత సర్కారు ఆమెకు నారీశక్తి అవార్డు ప్రదానం చేసింది.
attacked1

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles