ఆడపిల్లలు.. ఇందులో ఎక్కువ!


Mon,September 16, 2019 10:54 PM

రెండేళ్లు వచ్చాయి.. అయినా మా అబ్బాయికి ఇంకా సరిగా మాటలు రాలేదు.. అంటూ బాధపడేవాళ్లను చూస్తూనే ఉంటాం. ఆడపిల్లలు మాత్రం ఏడాది వయసు దాటగానే చిన్న చిన్న మాటలు చిలుకపలుకుల్లా మాట్లాడేస్తుంటారు. ఇందుకు కారణం వారిద్దరి ఎదుగుదలలో తేడా ఉండడమే.
Kids-Sitting
పెరుగుదల, మానసిక ఎదుగుదల, అభివృద్ధి ఆడపిల్లలు, మగపిల్లల్లో వేరుగా ఉంటుంది. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆడపిల్లలు ఎదుగుదలలో ఒక అడుగు ముందుంటారు. ఎదుగుదలలో ఇద్దరి మధ్య 3 నుంచి 6 నెలల వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆడపిల్లలు తొందరగా పరిణతి చెందుతారు. మగపిల్లలకు 11 నుంచి 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్లు శారీరకంగా బలంగా ఎదుగుతారు. ఇందుకు వాళ్లలోని టెస్టోస్టిరాన్ అనే లైంగిక హార్మోన్ కారణం. ఇకపోతే ఆడపిల్లల్లో లైంగిక హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి శారీరకంగా కన్నా మానసికంగా బలంగా ఎదుగుతారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలకి మానసిక పరిణతి ఎక్కువగా ఉంటుంది.


అంతేకాదు... ఆడపిల్లలకు మాటలు ముందుగా వస్తాయి. మగపిల్లల్లో మాటలు రావడం ఆలస్యం అవుతుంది. పర్సనల్ సోషల్ స్కిల్స్, ఇంటలెక్చువల్ స్కిల్స్ ఇద్దరిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. మగపిల్లలు శారీరకమైన పనులు చురుగ్గా చేస్తారు. ఆడపిల్లలు మెదడుతో ఆలోచించి చేసే పనులు అంటే ఏదైనా సమస్యను పరిష్కరించడం, మాటలు చెప్పడం వంటివి చురుగ్గా చేస్తారు. జబ్బు తీవ్రతను తట్టుకునే శక్తి కూడా ఆడపిల్లల్లో ఎక్కువ.

127
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles