గ్రూప్‌కాల్స్ కోసం ఓ యాప్


Wed,September 11, 2019 12:58 AM

సాధారణంగా గ్రూప్‌కాల్ అంటే పరిమితి ఉంటుంది. కానీ ఎక్కువ మందితో ఒక కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలంటే కాస్తా కష్టమే. కానీ grptalk అనే యాప్ ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
grptalk
పెద్ద మీటింగ్ కోసమో, చర్చల కోసమో ఒకేసారి ఎక్కువ మందితో ఫోన్‌లో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటిప్పుడు చక్కని మార్గం కాల్ కాన్ఫరెన్స్. కానీ ఇందులో పరిమితి ఉంటుంది. అదే grptalk యాప్ ఉంటే అదనపు ఫీచర్లతో కాల్ కాన్ఫరెన్స్ మాట్లాడొచ్చు. సుమారు 3 నుంచి వెయ్యి మందితో ఒకేసారి కాన్ఫరెన్స్‌లో మాట్లాడొచ్చు. దూర ప్రాం తాల్లో ఉండే ఫ్రెండ్స్‌తో, ఉద్యోగులతో కలిసి మాట్లాడడానికి వీలుంటుంది. grptalk.com నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్, ఓటీపీ ఇచ్చిన తర్వాత ఖాతా నమోదు అవుతుంది. అప్పుడు కాల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మన కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. ఎవరెవరితో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ల నంబర్లను కాల్‌లోకి చేర్చి డయల్ చేయడమే పని. అందరికీ ఒకేసారి కాల్ కనెక్ట్ అవుతుంది. దీంతో పాటు షెడ్యుల్ కాల్, డౌన్‌లోడ్ రికార్డింగ్ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ యాప్‌ను 55వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. తెలెబు కమ్యూనికేషన్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది.

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles