పిల్లల్లో యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఎందుకు?


Wed,September 11, 2019 12:55 AM

vasumathi
మా పాప వయసు 8 ఏళ్లు. పదే పదే యూరిన్‌కి వెళ్తోంది. మంట, నొప్పి అని కూడా అంటున్నది. యూరిన్ లో ఇన్‌ఫెక్షన్ అన్నారు డాక్టరు. ఇంత చిన్న పాపకు యూరిన్ ఇన్‌ఫెక్షన్ రావడమేంటి? ఎందుకిలా వస్తుంది? నివారించాలంటే ఏం చేయాలి?
- వసుమతి, హైదరాబాద్


పిల్లల్లో కూడా యూరిన్ ఇన్‌ఫెక్షన్ కామన్‌గానే కనిపిస్తుంది. సాధారణంగా పిల్లలు మూత్రవిసర్జన ఆపుకొంటుంటారు. టీవీ చూసేటప్పుడో, ఫోన్లో ఆడేటప్పుడో యూరిన్‌కి వెళ్తే టైం పోతుందని వెళ్లకుండా ఉంటారు. మరీ ఆగకపోతే ఒకవేళ వెళ్లినా మొత్తం బ్లాడర్ ఖాళీ చేయకుండా సగమే వెళ్లి వస్తుంటారు. స్క్రీన్ చూసేటప్పుడు మైండ్ అంతా దానిమీదే ఫోకస్ అవుతుంది. ఇక శరీరం గురించి పట్టించుకోరు. మరీ ఆపుకోలేకపోతే తప్ప వెళ్లరు. స్కూల్‌లో కూడా మూత్ర విసర్జన చేయకుండా ఆపుతుంటారు. సాధారణంగా పిల్లలకు స్కూల్‌లో బాత్రూమ్‌లు నచ్చవు. దాంతో యూరిన్‌కి వెళ్లడాన్ని ఇంటికి వచ్చేవరకు వాయిదా వేస్తుంటారు. రాగానే హడావిడి చేస్తారు. రోజంతా బ్లాడర్ నిండిపోయేసరికి ఇంటికొచ్చాక మూత్రవిసర్జన సాఫీగా రాదు. కొంచెం కొంచెం ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగరు. జంక్ ఫుడ్ అలవాటు ఎక్కువగా ఉంటున్నది. దాంతో పిల్లలకు యూరిన్ ఇన్‌ఫెక్షన్లు కామన్‌గా వస్తున్నాయి. ఇలాంటప్పుడు యాంటిబయాటిక్స్ ఇస్తారు. అవసరాన్ని బట్టి లాక్జేటివ్స్ కూడా ఇస్తారు. వీటిని డాక్టర్ చెప్పినన్ని రోజులు తప్పనిసరిగా వాడాలి. కొన్నిసార్లు స్కానింగ్ కూడా అవసరం అవుతుంది. యూరిన్ టెస్టు చేయించాలి. ఇలా ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే పిల్లలకు మూత్రవిసర్జన సక్రమంగా ఉండేట్టు అలవాటు చేయాలి. ప్రతిరెండు గంటలకు ఒకసారి యూరిన్‌కి వెళ్లేలా చూడాలి. గంటకోసారి గ్లాసు నీళ్లు తాగేలా ప్రోత్సహించాలి. బిస్కెట్లు, కుర్‌కురేల లాంటి జంక్‌ఫుడ్ ఇవ్వొద్దు. రోజుకి ఒకటిన్నర లీటర్ల నీరు తాగించాలి. పండ్లు ఎక్కువగా ఇవ్వాలి.
vasumathi1

292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles