ఆదివాసీల తొలి మహిళా పైలెట్‌!


Tue,September 10, 2019 12:29 AM

Anupriya-Lakra
ఆకాశంలో ఎగిరే విమానాలను దట్టమైన అడవుల మధ్యలోంచి చూసి చిన్నప్పుడు ఎంతో ముచ్చటపడింది. పెద్దయ్యాక తానూ విమానంలో ఎగరాలనుకున్నది. ఆ కోరిక ఒకసారి విమానం ఎక్కితే తీరిపోతుంది. మరీ రోజూ విమానాలు ఎక్కాలంటే.. పైలెట్‌ కావడం ఒక్కటే మార్గమని తెలుసుకున్నది. పైలెట్‌ అవ్వడమే లక్ష్యంగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నదీ యువతి.

‘అనుప్రియ గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయం సాధించారు. అంతేకాదు.. ఎంతోమంది ఆదివాసీలకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేకంగా అభినందించారు. చిన్నప్పుడు దట్టమైన అడవుల నుంచి విమానాలను చూసిందామె. ఆదివాసీ తొలి మహిళా పైలెట్‌గా ఎంపికవడంతో ఈ యువతి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23 ఏళ్ల అనుప్రియ లక్రాకు ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చిన ఈ యువతి కమర్షియల్‌ విమానం నడిపే స్థాయికి ఎదిగింది. 2012లో ఇంజినీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలేసి, పైలెట్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, భువనేశ్వర్‌లో శిక్షణ తీసుకున్నది. ఏడేండ్ల తర్వాత ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. అతి త్వరలోనే కమర్షియల్‌ ఫ్లైట్స్‌ను నడపనుంది అనుప్రియ. ఒడిశా నుంచి పైలట్‌గా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళ అనుప్రియ కావడం విశేషం. ఆమె తండ్రి మరినియాస్‌ లక్రా ఒడిశాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

402
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles