కైఫోప్లాస్టీతో నడుమునొప్పి మాయం


Mon,September 9, 2019 01:37 AM

మా అమ్మ వయసు 68 సంవత్సరాలు. ఒక నెల రోజుల క్రితం బాత్‌రూమ్ లో జారి పడ్డారు. పడిన వెంటనే నడుము నొప్పి అనడంతో వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాం. వెన్నుపాముకు ఎక్స్ రే తీసారు. ఎల్ 1, ఎల్ 2 అనే వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయ్యాయని తేలింది. ఎముకల్లో క్యాల్షియం తగ్గడం వల్ల అని చెప్పారు. బెడ్ రెస్ట్ తీసుకుని, మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. కాని నెలరోజులైనా నడుంనొప్పి ఇంకా ఎక్కువగానే ఉంది. పడుకొని లేవాలంటే నొప్పిగా ఉంది. దీనికి వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా?
- సుధాకర్, హైదరాబాద్

Tips-For-a-Speedy
ఆస్టియోపోరొసిస్ వల్ల క్యాల్షియం తగ్గి, ఎముకలు పెళుసుబారిపోతాయి. అందువల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఎముకలు విరుగుతాయి. ఈ ఆస్టియోపోరొటిక్ ఫ్రాక్చర్లు ఎక్కువగా వెన్నులో జరిగే అవకాశం ఉంది. వీటిని ఆస్టియోపోరొటిక్ వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్లంటారు. బెడ్‌రెస్ట్ ల్ల ఇవి మానడం మాట అటుంచి మరింత ప్రమాదం. ఒకరోజు బెడ్‌రెస్ట్ తీసుకుంటే ఎముకల్లో ఒక శాతం క్యాల్షియం తగ్గుతుంది. అసలే క్యాల్షియం తగ్గి అయిన ఫ్రాక్చర్ కాబట్టి ఇంకా సమస్య అవుతుంది. ఇటువంటి ఆస్టియోపోరొటిక్ ఫ్రాక్చర్లకు వర్టిబ్రోప్లాస్టీ, కైఫోప్లాస్టీ అనే పిన్ హోల్ ఆపరేషన్లు ఉంటాయి.


వర్టిబ్రోప్లాస్టీలో విరిగిన ఎముకలోకి ఒక సూదిని పంపించి దాని ద్వారా బోన్ సిమెంట్‌ను వెన్నుపూసలోకి ఇంజెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్లాక అది గట్టిపడి వెన్నుపూసకి సపోర్టు ఇస్తుంది. కైఫోప్లాస్టీ పద్ధతి మరింత ఆధునికమైంది. ఇందులో విరిగిన వెన్నుపూసలోకి సూదిని పంపించి, దాని ద్వారా బెలూన్ పంపి, ఇన్‌ఫ్లేట్ చేస్తారు. ఆ తరువాత బెలూన్‌ని డిఫ్లేట్ చేసి, వాటిని బయటకు తీసి, ఆ తరువాత బోన్ సిమెంట్‌ను ఇంజెక్ట్ చేస్తారు. వీటివల్ల నొప్పి త్వరగా తగ్గిపోవడమే కాకుండా పేషెంట్‌ని వెంటనే నడిపించవచ్చు.

డాక్టర్ జిపివి సుబ్బయ్య
సీనియర్ స్పైన్ సర్జన్,కేర్ హాస్పిటల్స్,హైదరాబాద్

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles