పండ్లపై ఉప్పూకారం చల్లుకోవచ్చా?


Mon,September 9, 2019 01:34 AM

చాలా పండ్లలో సహజంగానే తీపి ఉంటుంది. మామిడికాయల్లాంటివి మాత్రం పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని తినడం మనకు అలవాటు. అయితే కొన్ని పండ్ల మీద ఉప్పు కారం చల్లుకుని తింటే మంచిదే అంటున్నారు వైద్యులు.
Froots-Salt
-ఇటీవల జామకాయలు, పుచ్చకాయలు కట్ చేసుకొని వాటి మధ్య సాల్ట్ వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పండ్ల రుచి పెరుగుతుంది. మనకు తెలియకుండా పండ్లపై బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టీరియాను ఉప్పు చంపేస్తుంది.
-అలా అన్ని రకాల పండ్లపైనా ఉప్పు చల్లుకొని తినడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు ఉప్పు చల్లుకొని తినడం కరెక్టు కాదు. పైగా ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవు.
-అత్యంత పుల్లగా ఉండే సిట్రస్ జాతి పండ్ల మీద(ఉసిరికాయ, పుల్ల మామిడి, నారింజ) వంటి వాటి మీద ఉప్పు చల్లుకొని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్లను అడ్డుకోవచ్చు. ఫలితంగా అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
-జామకాయ మీద ఉప్పు చల్లుకొని తింటే దంతాలకు మేలు జరుగుతుంది. నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది. పుచ్చకాయ మీద ఉప్పు చల్లినా చల్లకున్నా ఎమీ తేడా ఉండదు. కానీ బీపీ, షుగర్‌తో బాధపడేవారు ఉప్పు చల్లుకోకపోవడమే మంచిది.

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles