నోటి దుర్వాసనా?


Mon,September 9, 2019 01:32 AM

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్య. కొన్నిసార్లు ఇది శరీరంలోని వివిధ రుగ్మతల వల్ల వచ్చినా, చాలా వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని ముందు జాగ్రత్తలతో నోటి దుర్వాసనను అరికట్టవచ్చు, అవేంటంటే..
Bad-Smell
-ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగ్‌క్లీనర్‌తో శుభ్రపర్చడం మరిచిపోవద్దు. రోజంతా తినేటప్పుడు వివిధ ఆహారపదార్థాలు కంటికి కనిపించని మలినాల్ని నాలుకపై వదులుతాయి. ఇదే ఓవర్ నైట్ పేరుకుపోయి ఇన్‌ఫెక్షన్ అయ్యి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
-ఆపిల్ లేదా క్యారట్‌ను రోజూ తినడం వల్ల పళ్లపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి శ్వాస శుభ్రంగా, తాజాగా ఎలాంటి దుర్వాసన లేకుండా వస్తుంది. సాఫ్ట్‌గా, క్రీం మాదిరిగా ఉండే ఆహారపదార్థాలు పళ్లపై, నాలుకపై అంటుకొని బ్యాక్టీరియాను పెంచి దుర్వాసనకు దారి తీస్తాయి.
-కాఫీ నోటి దుర్వాసనకు ఒక మూల కారణం. గ్రీన్ టీ ఓవర్ ఆల్ ఆరోగ్యాన్నే కాకుండా శ్వాసను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. అందుకే రొటీన్ కాఫీ, టీలకు బదులు గ్రీన్‌టీని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం, శ్వాసలో మార్పు వస్తుంది.
-కొబ్బరి నూనె ఆరోగ్య ప్రదాయిని. ఇది శ్వాసను మెరుగుపర్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. కొద్దిపాటి కొబ్బరి నూనెను నోట్లోకి తీసుకొని నాలుగైదు సార్లు పుకిలించడం వల్ల నోట్లోని హానికర బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది. పళ్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-ప్రతిరోజు మూడు పూటలు గోరువెచ్చని నీటితో పుకిలించినా, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని పుకిలించినా నోటి దుర్వాసన పోతుంది.

724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles