సేంద్రియ పచ్చళ్లు అమ్మబడును!


Sat,September 7, 2019 01:38 AM

భారతీయులు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చే పచ్చళ్లు మార్కెట్లో కల్తీ అవుతున్నాయి. పోనీ ఇంట్లో చేసుకుందాం అంటే అంత ఓపిక, సమయం ఉండదు. అందుకే ఈమె మార్కెటింగ్ ఉద్యోగం వదలి సేంద్రియ పద్ధతిలో పచ్చళ్లు తయారు చేసి పదిమందికి ఉపాధి కల్పిస్తున్నది.
Niharika-Bhargava
ఢిల్లీకి చెందిన నీహారిక భార్గవ తండ్రి విక్రమ్ భార్గవని ఆదర్శంగా తీసుకున్నది. ఆయన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండిస్తుంటాడు. వచ్చిన వాటితో పచ్చళ్లు పెట్టి బంధువులకు, స్నేహితులకు ఊరికే అందిస్తుండేవాడు. తండ్రి వారసత్వం కూతురుకి రాకపోతుందా?! లండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటెజీ చదివి కొన్నిరోజులు అక్కడే ఉద్యోగం చేసింది నిహారిక. 23 యేండ్ల వయసులో తనకు ఏది సరైన ఉద్యోగమో తెలుసుకొని మార్కెటింగ్ ఉద్యోగానికి స్వస్తి పలికింది. తండ్రి చేస్తున్న పనినే బిజినెస్‌గా మార్చుకున్నది. ది లిటిల్ ఫామ్ కో పేరుతో సేంద్రియ పద్ధతిలో పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్నది. ఇక్కడ సంప్రదాయ రెసిపీలతో మాండరిన్ ఆరెంజ్ పచ్చడి, అన్నిరకాల పచ్చళ్లు, సలాడ్ డ్రెస్సింగ్స్, సూపర్ ఫుడ్స్, మార్మలాడ్స్ తయారు చేయిస్తున్నది నిహారిక. పైగా ఎలాంటి మెషీన్స్‌ని వాడకుండా చేతితో మాత్రమే ఈ పచ్చళ్లు తయారు చేయడం విశేషం. గమ్మడికాయ గింజలు, చియా, ఫ్లాక్స్, సన్‌ఫ్లవర్ విత్తనాలు, చెరకు, వెనిగర్, అన్ని పదార్థాలను ఫామ్ నుంచి సేకరిస్తుంది. 100 ఎకరాల సాగుతో మొదలైన ఆమె ఫామ్ ఇప్పుడు 400 ఎకరాల చేరింది. నిహారిక మరొక సంస్థతో కలిసి వ్యాపారాన్ని మరింతగా విస్తారించాలనుకుంటున్నది. 70కి పైగా ప్రొడక్ట్స్‌ను ది లిటిల్ ఫామ్ కో డాట్ ద్వారా ఇప్పుడు అందిస్తున్నది.

340
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles