నిర్మాణ ఖర్చు తగ్గించేదెలా?


Sat,September 7, 2019 01:31 AM

construction
ప్రస్తుత కాలంలో మొత్తం నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం చాలా క్లిష్టంగా మారుతుంది. నిర్మాణ సమయంలో అంచనా వ్యయం, వాస్తవ ధరల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేయడం ఎంతో ముఖ్యం. ఈవిధమైన పరిస్థితుల్లో సమర్థవంతమైన వ్యయ నిర్వహణను పాటిస్తున్న చాలామంది బిల్డర్లకిది ఎంతో లాభదాయకమైన వ్యాపారంగా మారింది. అందుకే నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం అవసరమని గుర్తుంచుకోవాలి.


చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార చిన్న ఫ్లోర్ ప్లాన్లను ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో అనుకున్న సమయం లోపే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. కింది అంతస్తులో గదుల సంఖ్య తగ్గించి మొదటి అంతస్తులో ఇల్లు కట్టుకోవడం తెలివైన నిర్ణయమని చెప్పొచ్చు.

- తక్కువ నిర్వహణ ఖర్చు ఉండే నిర్మాణ సామగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలి. స్థానికంగా అందుబాటులో లభించే ఇటుకలు, సిమెంట్‌ను నిర్మాణానికి ఉపయోగించడం ద్వారా ఖర్చును కొంతమేరకు తగ్గించుకోవచ్చు. ఇదివరకే వాడిన వస్తువులు సహేతుకమైన ధరలో లభిస్తే వాటిని కొనుగోలు చేసి, తగిన విధంగా ఉపయోగించుకున్నా ఫర్వాలేదు. పెద్దమొత్తంగా వస్తువులు కొనాలకునేవారు రాయితీలను ప్రకటించే సమయంలో కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించేందుకు కొంత మేరకు ఆస్కారం ఉంటుంది.

- తక్కువ ధర ఉండే ప్రాంతాలను ఎంచుకుని ప్లాటును కొనుగోలు చేయాలి. రోడ్డుకు దగ్గర ఉండే ప్లాటు కంటే లోపలి వైపు ఉండే ప్లాట్ల ధర తక్కువగా ఉంటుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు ఇంటీరియర్ వస్తువులకు ఎక్కువ సొమ్మును కేటాయించేందుకు అవకాశం లభిస్తుందని గ్రహించాలి.

- నిర్మాణ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా పొదుపులకు హామీ ఇచ్చే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రీ ఫ్యాబ్రికేషన్ ప్రధానమైనది. దీన్ని సాయంతో ఇల్లు కట్టాలనే నిర్ణయానికొస్తే.. నమ్మకమైన కాంట్రాక్టర్లను మాత్రమే ఎంచుకోవాలి. అధిక సామర్థ్యం ఉన్న నిర్మాణాలకు ఆధునిక నిర్మాణ పద్ధతులు ఉపయోగపడటంతో పాటు ప్రయోజనకరంగానూ ఉంటాయని గుర్తించుకోవాలి.

- చాలా కాలంగా నిర్మాణం రంగంలో ఉన్న కాంట్రాక్టర్లను ఎంచుకుంటే నిర్మాణ సమయంలో మార్పులు చేర్పులకు తావు ఉండదు. దీంతో పాటు నాణ్యమైన నిర్మాణాన్ని ఆశించొచ్చు. నిర్మాణ ప్రక్రియలో వస్తువులను మార్చడం ద్వారా నిర్మాణ వ్యయం తడిసి మోపెడు అవుతుంది. లైసెన్స్ కలిగిన నిపుణులైన ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ల సలహా తీసుకుంటే నిర్మాణ వ్యయం తగ్గుతుంది.

166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles