అరవై రోజుల్లోనే అనుమతి


Sat,September 7, 2019 01:27 AM

గతంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు పొందడానికి అధిక సమయం పట్టేది. దీంతో రియల్టర్లు కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ ఇప్పుడు అరవై రోజుల్లోనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు రానున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు కానుంది. 2014 సంవత్సరానికి ముందు పర్యావరణ అనుమతులు పొందడానికి ఎక్కువకాలం వేచి చూడాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఇదివరకు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు అనుమతులు లభించేందుకు సరాసరి 640 రోజులు పట్టేది. ప్రస్తుతం ఆ ప్రక్రియను సులభతరం చేయడంతో కేవలం 108 రోజుల్లోనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ అనుమతులు 60 రోజుల్లోనే రానున్నాయి. పర్యావరణ అనుమతుల విషయంలో రాజీ పడకుండా వ్యవహరిస్తే ఎలాంటి విధానపరమైన ఆలస్యానికీ తావు ఉండదు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.


రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పరిమాణానికి అనుగుణంగా వాటర్ రీసైక్లింగ్, నీటి నిర్వహణ వంటి అంశాలపై ప్రామాణిక షరతులు జారీ చేయాలని రియల్ ఎస్టేట్ రంగ నిఫుణులు కోరుతున్నారు. రియల్ రంగంలో తక్కువ షరుతులను ప్రవేశపెట్టి, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన వ్యాపారం చేయడం సులభమవుతుంది. పర్యావరణ అనుమతులను తక్కువ సమయంలో తీసుకునేలా రాష్ర్టాలతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ర్టాలన్నీ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని కోరింది.

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles