పర్‌ఫ్యూమ్ కొనేముందు


Thu,September 5, 2019 01:04 AM

పర్‌ఫ్యూమ్ అంటే కేవలం సువాసననిచ్చేదే కాదు. హుందాను, వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక్కో పర్‌ఫ్యూమ్ వేలు పెట్టి కొనుకున్నా ఆ సువాసన కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుంది. కానీ పర్‌ఫ్యూమ్ సువాసన ఏండ్ల తరబడినా మనసులో నిలిచిపోవాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాల్సిందే.
perfume-women
-పర్‌ఫ్యూమ్ కొనే ముందు బాటిల్‌పై మూడు నోట్స్ ఉంటాయి. టాప్, బాటమ్, మిడిల్. టాప్ నోట్ అంటే స్ప్రే చేసిన తర్వాత తొలి 15నిమిషాలు వాసన పడుతుంది. ఆ తర్వాత అది మసకబారుతుంది. మిడిల్ నోట్ అయితే కొన్ని గంటల వరకు ఉంటుంది. బాటమ్ నోట్ అయితే రోజంతా వాసన ఉంటుంది. పర్‌ఫ్యూమ్ కొనేముందు ఈ మూడు అంశాలను చూసి మనం కొనుక్కోవాలి.
-మొదటిసారి పర్‌ఫ్యూమ్‌ను వాడే వారు తేలికపాటి సువాసనలు ఉండేట్లు ప్రయత్నిస్తే మంచిది. మస్కీ, కలప వంటి పర్‌ఫ్యూమ్‌లు తేలికైన సువాసనల్ని వెదజల్లుతాయి.
-అన్ని పర్‌ఫ్యూమ్‌లను ఒకేసారి ప్రయత్నించవద్దు. సువాసనలను పరీక్షించడంలో అస్సలు తొందర పడొద్దు. ఎంత ఎక్కువగా వాసన చూస్తే అంతగా మంచి వాటిని గుర్తు పట్టలేకపోతారు. అందుకని రెండు మూడు పర్‌ఫ్యూమ్‌ల కంటే ఎక్కువగా ప్రయత్నించవద్దు.
-పర్‌ఫెక్ట్ పర్‌ఫ్యూమ్ ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఉత్తమ మార్గం మీ శరీర పల్స్ పాయింట్ల వద్ద పరీక్షించడం. శరీర పల్స్ పాయింట్లు చెవుల వెనుక, గొంతు వద్ద, మణికట్టు మీద, మోచేతుల వెనుక భాగంలో, మోకాళ్ల వెనుక ఉంటాయి. ఈ భాగాలే సువాసనను తీవ్రతరం చేసేందుకు సాయపడుతాయి.

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles