పొట్టపై చారికలు పోవాలంటే..


Sat,August 31, 2019 12:52 AM

డెలివరీ తర్వాత మహిళలకు పెద్ద తలనొప్పి పొట్టపై చారికలు. ఇవి ఒక సారి వచ్చాయంటే దాదాపు పోవు. చర్మం బాగా సాగి మళ్లీ మామూలుగా అయ్యే క్రమంలో పడే ఈ గీతల్ని పోగొట్టుకోవడానికి మహిళలు నానా తంటాలు పడుతుంటారు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పొట్టపై ఉన్న ఎంతటి స్ట్రెచ్ మార్క్స్ అయినా తొలగిపోతాయి.
Strech-Marks
-స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడంలో కోడిగుడ్డు మంచి ఎక్స్‌పర్ట్. దీనిలో ఉండే విటమిన్ ఎ, ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్ చర్మ కణాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. అందుకే మార్క్స్ ఉన్న చోట కోడిగుడ్డు సొనతో తరచూ రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
-అలోవెరా జెల్‌లో ఉండే అలోసిన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ జెల్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రోజూ పడుకోబోయే ముందు రాసుకుంటే కొన్నాళ్లకు సమస్య తీరిపోతుంది. నిమ్మచెక్కతో తరచూ రుద్దుకున్నా మంచిదే..
-ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మసాజ్‌లు కూడా స్ట్రెచ్ మార్క్స్‌ని పోగొట్టి, చర్మం ఎప్పటిలాగే అయ్యేందుకు దోహదపడుతాయి. బంగాళాదుంపని బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంతో మార్క్స్ ఉన్న చోట బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే అతి తక్కువ సమయంలోనే తొలగిపోతాయి.
- పంచదారలో కొంచెం నిమ్మరసం కానీ కాస్తంత బాదం నూనె కానీ కలిపి రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్తంత తేనె, నిమ్మరసం వేసి కలిపి పొట్టపై వారం రోజులు రోజుకో రెండు నిమిషాలు మసాజ్ చేస్తే మార్క్స్ తొలగిపోతాయి.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles