సర్పాల సంరక్షకురాలు!


Sat,August 31, 2019 12:49 AM

పామును చూస్తే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. లేదా దాని మీద దాడి చేస్తారు. కానీ ఈ అరవై ఏండ్ల విద్యారాజు అలా చేయదు. రక్షణ లేని పాములను చేరదీసి, సంరక్షిస్తున్నది.
vidya
అరవై ఏండ్లు వచ్చినా ఆమెకు అలసట అనేది లేదు. పాములను సంరక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటి వరకూ వేల పాములను, సరీసృపాలను రక్షించింది. ఇలా పాములను రక్షించడం వెనుక ఓ కారణం ఉంది. చిన్నప్పుడు ఆమె కండ్ల ముందటే చాలా మంది పాములను చంపడాన్ని చూసింది. ఆమె ఎదుగుతున్న కొద్ది పాముల స్వభావం, పర్యావరణంలో పాముల ఆవశ్యకతను తెలుసుకుంది. అప్పుడే అనుకుంది పాములను రక్షించాలని. కేరళకి చెందిన విద్యారాజు.. 2002లో భర్త ఉద్యోగ రీత్యా గోవా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో చేరింది. అక్కడ నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. మళ్లీ కేరళకు తిరిగి వచ్చిన తర్వాత కూడా పాములను సంరక్షించడం ఆపలేదు. దీని కోసం వ్యక్తిగత శిక్షణ తీసుకుంది. అట్లాగే కేరళలో వరదల సమయంలో ఇండ్లలోకి పాములు వచ్చిప్పుడు వాటిని పట్టుకుంది. దానికోసం ఆమె చేసిన సాహసం అంతాఇంతా కాదు. నిజానికి పాములు ఎలాంటి హానీ చేయవు, మనుషుల నుంచి వాటికి హానీ ఉందని తెలిస్తేనే తిరగబడతాయి అని విద్య అంటున్నది.

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles