ప్రాజెక్టు డిజైనింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ


Sat,August 31, 2019 12:41 AM

TNR-PRESTON-MALL
- ప్రెస్టన్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ డి.రణ్‌ధీర్‌రెడ్డి


దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో గడ్డు పరిస్థితులు నెలకొంటే.. ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకెళుతున్నది. ఈ అంశాన్ని గుర్తించి నగరంలో మల్టీప్లెక్స్‌ థియేటర్లు, లగ్జరీ విల్లాల నిర్మాణాల్ని చేపడుతున్నామని ప్రెస్టన్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ డి.రణ్‌ధీర్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో ప్రెస్టన్‌ ప్రైమ్‌ మాల్‌, మల్టీప్లెక్స్‌ ఆరంభించిన సందర్భంగా ‘సంపద’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం ఆయన మాటల్లోనే..

“నిర్మాణ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో నాణ్యమైన కట్టడాల్ని చేపట్టాలన్నదే మా లక్ష్యం. అందుకే ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రత్యేక చర్యల్ని తీసుకుంటున్నాం. డిజైనింగ్‌, ఎలివేషన్లు కాస్త విభిన్నంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ క్రమంలో.. ప్రజలకు వినోదం, ఆహ్లాదాన్ని పంచే మాళ్లు, మల్టీప్లెక్సులకు గిరాకీ మెరుగ్గా ఉంటుందని మా అధ్యయనంలో తేలింది. అందుకే, గచ్చిబౌలి ప్రధాన రహదారిలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రెస్టన్‌ ప్రైమ్‌ మాల్‌, మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాం. ఇందులో నాలుగు అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్‌ థియేటర్లు, వెయ్యి సీట్ల సామర్థ్యం గల ఫుడ్‌ కోర్టు, గేమింగ్‌ జోన్‌, బ్రాండెడ్‌ రిటైల్‌ షాపులకు స్థానం కల్పించాం. అత్యుత్తమ నాణ్యతను కోరుకునే వినియోగదారులకు అన్నిరకాలుగా నప్పేలా ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. కర్మాన్‌ఘాట్‌లో సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మల్టీప్లెక్స్‌, మాల్‌ మొదలెట్టాం. టీఎన్‌ఆర్‌ ప్రెస్టన్‌ గా నామకరణం చేసిన ఈ మాల్‌, మల్టీప్లెక్సులో 2700 సీట్ల సామర్థ్యం గల 11 స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాం.

మాదాపూర్‌ గుట్టలబేగంపేట్‌లో 89 అల్ట్రా లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నాం. ‘ప్రెస్టన్‌ ఐవీ’ అని నామకరణం చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే అమ్మకాలూ పూర్తయ్యాయి. కొల్లూరులో ‘ప్రెస్టన్‌ అమరీ’ ప్రాజెక్టును ప్రారంభించాం. ఇందులో దాదాపు 178 లగ్జరీ విల్లాలను చేపడుతున్నాం. ఈ నిర్మాణం అమ్మకాలు అనుకున్న దానికంటే యమ జోరుగా పూర్తి కావడం విశేషం. అక్కడే ప్రెస్టన్‌ గ్రీన్‌విల్లే అనే ఆధునిక గేటెడ్‌ కమ్యూనిటీ ప్లాట్లను అభివృద్ధి చేశాం. ఇందులో ప్లాట్లు కొన్నవారు అతితక్కువ కాలంలోనే చక్కటి అప్రిసీయేషన్‌ని అందుకున్నారు. ఇప్పటివరకూ దాదాపు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య భవనాల్ని నిర్మించాం. ప్రస్తుతం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నాం. ఇవి కాకుండా, ప్రణాళికా దశలో మరో పది లక్షల చ. అడుగుల్లో నిర్మాణాల్ని చేపడుతున్నాం.”

78
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles