పండే కాదు.. తొక్క కూడా ఉపయోగమే


Thu,August 29, 2019 12:33 AM

రోజుకో పండు తింటే శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. అయితే ఈ తొక్కలు చర్మానికి ఎలా ఉపయోగపడుతాయో చూద్దాం.
skin
నారింజపండు : వీటిని తిని తొక్కలను పడేస్తారు. పిల్లలయితే తొక్కలను కంట్లో నలుపుకొని సరదాగా ఆడుకుంటారు. వీటితో అందం కూడా రెట్టింపు చేసుకోవచ్చు. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్‌వాటర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుగాలి.

పొప్పడి : బాగా పండిన పొప్పడి గుజ్జును తీసుకోవాలి. దానికి తేనె, పాలు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మొటిమలు ఉంటే ఈ మిశ్రమంలో పాలకు బదులుగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి.

అరటిపండు : ఈ పండుని తిని తొక్కలను తీసిపెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు తొక్క లోపలి భాగంతో ముఖంపై రుద్దాలి. దీన్ని 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం అందంగా మారడం గమనించవచ్చు.

పుచ్చకాయ : ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయ గుజ్జును తిన్న తర్వాత కాయను కొంచెంసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వా త లావుగా ఉండే ముఖనికి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది.

మామిడిపండు : వీటి తొక్కలను బాగా ఎండబెట్టి పౌడర్ చేయాలి. అందులో కొంచెం గోధుమపిండి, నీటిని వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మంపై ట్యాన్ తొలుగుతుంది.

552
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles