దివ్యాంగుల ఆశాజ్యోతి


Thu,August 29, 2019 12:30 AM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగులు వీల్‌చైర్లపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానంలో స్మింజు అనే ఈ దివ్యాంగురాలి పోరాటం ఉన్నది.
Jindaal
స్మింజు జిందాల్.. దివ్యాంగులపాలిట ఆశాజ్యోతి. స్వతంత్య్ర భారతంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దివ్యాంగులకు కూడా స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉన్నదని చెబుతున్నది. ఆ దిశగా దివ్యాంగులకు కూడా ప్రభుత్వాలు మౌలిక సదుపాయలు, రవాణ వ్యవస్థను కల్పించాలని పోరాటం చేస్తున్నది స్మింజు. తన పోరాటాల ఫలితంగా ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకున్నది. తన 11వ యేట జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారు ప్రమాదం జరగింది. ఈ ప్రమాదంతో వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో వీల్‌చైర్‌కే పరిమితమైంది. తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించి బాగా చదువుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలా పదేండ్ల పాటు ఇంటికే పరిమితమైంది స్మింజు. ఆ తర్వాత స్వయం అనే ఎన్జీఓను ఏర్పాటు చేసి దివ్యాంగులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పోరాటాలు చేస్తున్నది. వాటి ఫలితంగా దేశంలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, హోటల్స్, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌లో చాలా సంస్కరణలు జరిగాయి. ప్రస్తుతం స్వయం సంస్థ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్జ్ బోర్డ్ (టీఆర్‌బీ)లో సభ్యుడిగా కొనసాగుతున్నది. దేశంలో పేరొందిన చారిత్రక కట్టడాలను దివ్యాంగులు సందర్శించించేందుకు వీలుగా.. కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది స్మింజు. ఆమె కృషికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి, ఇతర సంస్థల నుంచి అవార్డులు, సత్కారాలు అందుకున్నది.

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles