ప్రాణం కాపాడే ప్రథమచికిత్స


Tue,August 27, 2019 01:28 AM

హార్ట్ ఎటాక్ ఇప్పుడు సర్వ సాధారణం అయ్యింది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నది. తెలిసినవాళ్లకుగానీ.. ప్రయాణంలో ఇంకెవరికైనా గానీ హార్ట్ ఎటాక్ వస్తే ప్రథమ చికిత్సగా సాయంచేసి ఓ నిండు ప్రాణాన్ని రక్షించొచ్చు. ఎలా?
Heart-Attack-Aid
డాక్టర్ మనకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండరు కాబట్టి.. వైద్య సాయం అందేవరకు రోగిని పడుకోబెట్టి దుస్తులను వదులు చేయాలి. ఆక్సీజన్ అందివ్వాలి. నైట్రోగ్లిజరిన్ లేదా సోర్బిట్రేట్ మాత్రలు అందుబాటులో ఉంటే ఒకటి లేదా రెండు నాలుక కింద ఉంచాలి. కరగేసిన ఆస్పిరిన్ మాత్ర కూడా ఇవ్వాలి. ప్రథమదశలో హృదయ ధమనులలోని అడ్డంకులు కరగడానికి ఈ మందులన్నీ ఉపయోగపడుతాయి. అంబులెన్స్‌కు వెంటనే సమాచారం అందించాలి. మందులు నొప్పి ఉపశమనం కోసమే.. కానీ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే మాత్రం ప్రమాదం గురించి ఆలోచించకుండా రోగికి మనో నిబ్బరాన్ని కలిగించేలా వ్యవహరించాలి. విశ్రాంతి.. నిద్రకు ప్రోత్సహించాలి. ఇది చికిత్సలో భాగం అనేది గుర్తుంచుకోవాలి. హాస్పిటల్‌లో చేర్చి హార్ట్ ఎటాక్ తీరు డాక్టర్‌కు విశ్లేషిస్తే ప్రాణాన్ని కాపాడినవాళ్లు అవుతారు.

100
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles