మన జాతిపతాక ఇస్రో


Fri,August 23, 2019 01:12 AM

Shastreeyam
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపితమై ఇటీవలె యాభయ్యేండ్లు పూర్తి చేసుకున్నది. సరిగ్గా మన దేశానికి స్వాతం త్య్రం వచ్చిన ఆగస్టు 15 (1969) నాడే ఈ సంస్థ ఏర్పడడం విశేషం. ఏ సంస్థకైనా, వ్యక్తులకైనా 50 ఏండ్ల కాలం తక్కువేమీ కాదు. ఇదొక కీలక మైలురాయి. కానీ, ఎంతమంది ఈ విశేష సందర్భాన్ని తలచుకొంటున్నారు? ప్రత్యేకించి మీడియానే దీనిని గుర్తు చేస్తున్నట్టుగా ఉన్నది. అంతరిక్ష కార్యక్రమంలో అనూహ్య విజయాలు సాధించినప్పుడల్లా వాటిని ఘనంగా, గొప్పగా ప్రకటించుకొనే కేంద్ర ప్రభుత్వ నాయకత్వాలు ఇస్రో గోల్డెన్ జుబ్లీ వేడుకల సంవత్సరాన్ని కనీసం నామమాత్రంగానైనా జరుపుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నట్టు? క్రికెట్ విజయాల్ని సొంతం చేసుకొంటున్నంత హృద్యంగా, జాతీయతా భావంతో ప్రజలుకూడా మన అంతరిక్ష ప్రయోగాలను ఎందుకు సగర్వంగా సొంతం చేసుకోలేక పోతున్నారు? సమాచార, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఆన్‌లైన్ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులకు మూలకారణమైన కృత్రిమ ఉపగ్రహాలు గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో తెచ్చిన ప్రగతిదాయక మార్పును మరిచిపోవడం భావ్యం కాదు.


సైన్సు, శాస్త్రవేత్తలు, పరిశోధనల ప్రాధాన్యాన్ని మన దేశ పాలకులు, ప్రజలు ఇప్పటికైనా తగురీతిలో గుర్తించాలి. ఇస్రో గోల్డెన్ జుబ్లీ వేళలోనైనా గత 50 ఏండ్లుగా అద్భుతాలు సాధించిన మన శాస్త్ర సాంకేతిక దిగ్గజాల అసామాన్య కృషిని సముచితంగానైనా గౌరవించుకొందాం. ప్రభుత్వాలు, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి పట్టం కట్టినప్పుడే రాబోయే భవిష్యత్తుకు మరింత గొప్ప పూచీకత్తు లభిస్తుంది.

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles