100 రెట్లు అధిక వేగం


Fri,August 23, 2019 01:09 AM

ఉపరితలం మీది హిమపర్వతాలతోపాటు జలాంతర మంచుదిబ్బలూ ఇప్పటి అంచనాలకన్నా 100 రెట్లు అధికవేగంతో కరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం వెల్లడించింది.
Paryavaranam
అమెరికాకు చెందిన న్యూ బ్రూన్స్‌విక్ (New Brunswick) నగరంలోని రట్గర్స్ (Rutgers) యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్‌ల్యాండ్స్, అలాస్కా, అంటార్కిటికాల్లోని జలాంతర్గత హిమఖండాలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ఇదివరకు అఖాత విద్యుత్తును అంచనా వేసినట్లుగానే నీరు, గాలి ఉష్ణోగ్రతల ఆధారంగానే ద్రవీభవన వేగాన్నికూడా ధ్రువీకరించారు. ఇది కచ్చితమైన అంచనా కాదని పై పరిశోధన పేర్కొన్నది. అఖాత లవణీయత, హిమదిబ్బ ఆకారం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తుత అధ్యయన బృందం సహ రచయిత రెబెక్కా జాక్సన్ (Rebecca Jackson) తెలిపారు. జలగర్భ మంచుదిబ్బ స్థితిని సోనార్ పరికరంతో స్కానింగ్ చేశామని, ద్రవీభవ జలప్రవాహ విద్యుత్తును, ఉష్ణోగ్రతను, లవణీయతనూ పరిగణనలోకి తీసుకొని, అత్యంత కచ్చితత్వంతో అధ్యయనం చేశాకే పై విషయం తేలిందని వారు తెలిపారు. ఈ పరిశోధన సైన్స్ జర్నల్ ఇటీవలి సంచికలో ప్రచురితమైంది.

573
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles