కోపం ఎందుకు వస్తుంది?


Fri,August 23, 2019 01:09 AM

మనిషిలో ఉండే గుణాల్లో ఒకటైంది కోపం. ఇది ప్రతి మనిషిలో ఉండే సహజమైన భావోద్వేగమే. ఒకరి అభిప్రాయాలకు భిన్నంగా, ఇష్టమైన వాటికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎదుటి వారి మీద కోపం వస్తుంది. ఈ ఉద్వేగం నియంత్రించుకోనప్పుడు అనారోగ్యకరమైన వాతావరణానికి దారి తీస్తుంది.
angry
-కోపంగా ఉన్న వ్యక్తులు వారు సాధించగలిగేదాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఇలాంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనే నమ్మకం ఆహ్లాదకరంగా ఉంటుందని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అంటారు.
-కోపం మనిషిలోని సాధారణ ఆరోగ్యకరమైన భావోద్వేగం అని పరిశోధనలు చెపుతున్నాయి. కానీ అదే పనిగా కోప్పడడం అనారోగ్యానికి దారితీయడంతో పాటు, సంబంధ బాంధవ్యాలను దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి చాలా సందర్భాల్లో కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం.
-ప్రశాంతంగా ఉండే వారిలో కంటే కోపంగా ప్రవర్తించే వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువ. జీవన శైలిలో మార్పు కారణంగా రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలే కోపానికి కారణం అవుతున్నాయి. ప్రధానంగా కుటుంబ, ఆర్థిక సమస్యలు కోపాన్ని పెంచుతాయి.
-అతిగా కోపోద్రిక్తుడవడం అంటే శరీరంలోని మోనోమైన్ ఆక్సిడెస్‌ఏ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక్కోవ్యక్తిలో ఒక్కో మోతాదులో ఉంటుంది.
-అతి కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. ఏ కారణంతో కోపం వస్తుందో ముందు గుర్తించాలి. దాన్ని బంధువులు, టీచర్లు, సహోద్యోగులు ఇలా ఎవరితోనైనా విషయాన్ని పంచుకోవడం ద్వారా కోపాన్ని నియంత్రించుకోవచ్చు.
-వారి నుంచి సలహాలు తీసుకోవడం వల్ల అవగాహన వస్తుంది. ఇలా సులువుగా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా వయస్సు పెరిగే కొద్ది కూడా కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకోవచ్చు.

651
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles