సహచరుల సాయం


Tue,August 20, 2019 12:33 AM

స్నేహితులతో జన్మదిన వేడుకలు జరుపడం మామూలే. కానీ ఆ వేడుకకు ఒక అర్థం ఉండాలనుకున్నారు కొందరు స్నేహితులు. బెంగళూరుకు చెందిన ఓ స్నేహితుల బృందం చావుబతుకుల్లో ఉన్న ఓ స్నేహితురాలి తల్లి చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందించారు.
science
బెంగళూరుకు చెందిన 40 మంది స్నేహితులు ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ బృందానికి సైన్స్ ఉత్సవ్ క్లబ్‌అని పేరు పెట్టారు. బృందంలోని సభ్యురాలు సత్వీర్‌కౌర్ తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. ఆమె చికిత్సకు అవసరమైన డబ్బును సమకూర్చేందుకు సైన్స్ ఉత్సవ్ క్లబ్ సభ్యులంతా ముందుకొచ్చారు. అందుకోసం సైన్స్ ఉత్సవ్ క్లబ్ తరపున అందరూ కలిసి నిధులు సేకరించేందుకు ఆన్‌లైన్‌లో సైన్స్ ఫర్ ఏ కాజ్ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సైన్స్‌పై అవగాహనా తరగతులు నిర్వహించి తద్వారా వచ్చిన మొత్తాన్ని సత్వీర్‌కౌర్ తల్లికి అవసరమైన చికిత్సను అందించారు. ఆర్థికంగా సాయమందించడమేకాకుండా సత్వీర్‌కు ఆమె తల్లికి మనోధైర్యాన్నిచ్చారు.
science-utsav
సత్వీర్ తల్లి చికిత్సకు రూ.15లక్షలు అవసరం. సహచరులు ఇచ్చే ప్రతి రూపాయి ఎంతో విలువైంది, వారు ఇచ్చిన మద్దతుతో ధైర్యంగా ఉన్నామనిసత్వీర్ చెబుతున్నది. ఇటువంటి స్నేహితులుండడం నా అదృష్టం అని అంటున్నది. సైన్స్ ఉత్సవ్ బృందం వారు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని పాఠశాలల విద్యార్థులకు సైన్స్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. వీటి ద్వారా సేకరించిన రూ. 80వేలు ఆమె వైద్యం కోసం అందించారు. ఇప్పుడు సైన్స్ ఉత్సవ్ బృందం సభ్యులు మరి కొన్ని నిధులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

453
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles