ఫార్వర్డ్‌ మెసేజ్‌లకు చెక్‌


Wed,August 14, 2019 12:35 AM

తప్పుడు సమాచారాన్ని కంట్రోల్‌ చేసేందుకు వాట్సాప్‌ చర్యలు చేపట్టింది. మెసేజ్‌ ఎన్నిసార్లు ఫార్వర్డ్‌ చేశారో
తెలియజేయనుంది.

whats-app-new
యూజర్‌ ఎవరైనా ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందు వాట్సాప్‌ నోటిఫై చేస్తుంది. ‘ఫార్వార్డెడ్‌ మెనీ టైమ్స్‌' మార్క్‌ కనిపిస్తుంది. అప్పుడు యూజర్‌ ఆ మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేయాలా? లేదా క్విట్‌ చేయాలో ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఫ్రీక్వెంట్లీ ఫార్వార్డ్‌ లేబుల్‌ ఫీచర్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ ఫీచర్‌లో ఎన్నిసార్లు మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేసినా ‘ఫార్వార్డెడ్‌' అని చూపిస్తుంది. ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్‌ద్వారా మెసేజ్‌ను 5సార్లు కంటే ఎక్కువగా ఫార్వార్డ్‌ చేసినప్పుడు మాత్రమే నోటిఫికేషన్‌ వస్తుంది. టెక్స్‌మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను కూడా మెసేజ్‌ మాదిరిగానే ట్రీట్‌ చేస్తుంది. ఎన్నిసార్లు మెసేజ్‌ ఫార్వార్డ్‌ అయినా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. ఈ ఫార్వార్డ్‌ ఇన్ఫో ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

544
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles