జాగింగ్ ఎంతో మంచిది


Wed,August 14, 2019 12:22 AM

నిత్యం ఆరోగ్యంగా ఉండాలన్నా.. గుండె పదిలంగా ఉండాలన్నా జాగింగ్ చేయాల్సిందే. అధిక రక్తపోటు, మధుమేహం ఇలా వ్యాధి ఏదైనా వైద్యులు సూచించేదొక్కటే. అదే వ్యాయామం. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయంటే..
jogging
-జాగింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొలెస్ట్రాల్.. చెమట రూపంలో బయటకు వస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
-జాగింగ్ సమయంలో గాలిని ఎక్కువగా పీల్చుకుంటాం. అలా పీల్చుకోవడం వల్ల శరీరంలోని శక్తి వినియోగమవడమే కాదు.. అంతకు మించిన శక్తి ఉద్భవిస్తుంది. శ్రమవల్ల చెమట ఎక్కువగా వస్తుంది. ఈ కారణంగా మరింత చురుగ్గా ఉండవచ్చు.
-జాగింగ్ చేసే అలవాటు లేనివారు పరుగెత్తాల్సి వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది. అప్పుడు దాహం ఎక్కువగా వేయడంతో పాటు కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో కాస్త రెస్ట్ తీసుకుని తిరిగి మళ్లీ జాగింగ్ చేయాలి.
-జాగింగ్ అనేది శరీరాన్ని అలసట లేదా ఒత్తిడి నుంచి తట్టుకునేలా చేయగలిగే ప్రక్రియగా చెబుతారు. జాగింగ్‌ను ఆరుబయట ప్రదేశాల్లో చేయడం వల్ల మనలోని మానసిక అలజడి తగ్గి ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరం కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. అందుకే రోజూ ఉదయాన్నే జాగింగ్ చేస్తే ఎంతో మంచిదని నిపుణుల అభిప్రాయం.
-జాగింగ్ చేయడానికి ప్రత్యేకమైన వస్తువులు, సౌకర్యాలు కూడా అవసరం లేదు. బాగా సౌకర్యవంతంగా ఉండే బూట్లను వేసుకుంటే చాలు. కాబట్టి మంచి షూ తీసుకుని, వాతావరణానికి అనుగుణంగా చెమటను పీల్చుకునేలా ఉండే బట్టలను వేసుకుని చక్కగా జాగింగ్ ప్రారంభిస్తే చాలు.

90
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles