పాప్‌కార్న్‌తో మేలు


Wed,August 14, 2019 12:20 AM

పాప్‌కార్న్ కేవలం టైంపాస్ కోసం తినే ఆహారం మాత్రమే కాదు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవేంటో.. వాటివల్ల కలిగే ఉపయోగాలంటో తెలుసా?
popcorn
-పాప్‌కార్న్‌లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది అధిక బరువుని తగ్గిస్తుంది.
-షుగర్, ఇన్సులిన్ పరిమాణాలను పాప్‌కార్న్ క్రమబద్ధీకరిస్తుంది. దీనిలోని విటమిన్స్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి దోహదపడతాయి.
-పాప్‌పార్న్‌ను రోజూ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు. పాలకూర కన్నా పాప్‌కార్న్‌లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇది పెద్ద పేగును క్యాన్సర్ బారినుంచి కాపాడుతుంది.
-శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి పాప్‌కార్న్ చాలా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఎనర్జీని పెంచుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ పాప్‌కార్న్ అందిస్తుంది.
-పాప్‌కార్న్‌లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంటుంది. ఇది బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించి, అదే స్థాయిలో వాటి దృఢత్వాన్ని కొనసాగేలా చూసేందుకు సాయపడుతుంది. మాంగనీస్ ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. దీంతో ఆస్టోయోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు దూరమవుతాయని వైద్యులంటున్నారు.

80
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles