నఖసౌందర్యం.. హుందాతనం!


Wed,August 14, 2019 12:18 AM

మహిళల సౌందర్యంలో గోళ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. గోళ్ల సంరక్షణకు, గోళ్ల సౌందర్యానికి బ్యూటీ పార్లర్‌లలో మినిక్యూర్, పెడిక్యూర్ అంటూ అనేక రకాల విధానాలు అందుబాటులోకొచ్చాయి. అయితే అవి కొంత ఖర్చుతో కూడుకున్నవి.
కానీ ఒక్కరూపాయి ఖర్చు లేకుండా అందమైన గోళ్లను పొందాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

Nails
-కొందరు చీటికి మాటికి గోళ్లను కొరుకుతుంటారు. గోళ్లను ఇష్టానుసారంగా కత్తిరించడం, తుంచడం వంటివి ముందుగా మానుకోవాలి. ఆ తర్వాత రోజూ మాయిశ్చరైజింగ్ లోషన్‌తో గోళ్లకు మసాజ్ చేయాలి. గోళ్లవద్ద రక్త ప్రసరణ సవ్యంగా జరిగితే అవి బలంగా, పొడవుగా పెరిగే వీలుంటుంది.
-మహిళలు రోజూ వీలైనన్ని ఎక్కువసార్లు మంచి నీళ్లు తాగితే చర్మం పగిలిపోకుండా ఉంటుంది. గోళ్లు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారం తీసుకుంటే గోళ్లు బలంగా పెరుగుతాయి.
-రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను వేళ్లకు అద్దుకొని గోళ్లు, గోళ్ల చుట్టూ వేళ్లపైన మర్దన చేయాలి. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా పాలను వాడవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తే గోళ్లకు జీవకళ ఇనుమడిస్తుంది. గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి విటమిన్ ఇ అంది ఆ భాగమంతా మృధువుగా తయారవుతుంది.
-గోళ్ల సందుల్లో మురికిని తొలగించడానికి సూదులు, అగ్గిపుల్లలు వంటివి వాడడం మంచిది కాదు. నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి ఎసిటోన్ ద్రావకాన్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది. ఎసిటోన్ వాడకుండా ఒక మంచి కంపెనీ పెయింట్ రిమూవర్‌ను వాడవచ్చు.

218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles