వంటింటి చిట్కాలు


Wed,August 14, 2019 12:16 AM

vantinti-chitkalu
-తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగు పట్టదు.
-తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే.. శుభ్ర పరిచిన సీసాలో పోసి రెండు లవంగాలు దానిలో వెయ్యాలి.
-నాలుగైదు చుక్కల నిమ్మరసం మాత్రమే అవసరమైనప్పుడు కాయను రెండు ముక్కలుగా కోయవద్దు. సూదితో కాయకు రంధ్రం చేసి రసం పిండితే సరిపోతుంది.
-ఎండుకొబ్బరి సులభంగా తురుమాలంటే దానిపై కొంచెం నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి.
-పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రపరిస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
-కొబ్బరికాయ కచ్ఛితంగా మధ్యకు పగులగొట్టాలంటే, కాయను కాసేపు నీళ్లల్లో ఉంచి ఆ తర్వాత కొట్టి చూడండి.
-కొబ్బరి చిప్పలు పసుపు పచ్చగా మారకుండా ఉండాలంటే వాటిని సీసాలో పెట్టి మూతపెట్టాలి.
-పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే.. ఓ బేసిన్‌లో వేడినీళ్లు పోసి తోడుకోని పెరుగు గిన్నెను ఆ నీటిలో ఉంచి.. నీళ్లను మరలా మరుగపెడితే.. కొద్దిసేపట్లో గడ్డ పెరుగు తయారవుతుంది.
-ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తళతళా మెరిసిపోతాయి.

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles