మెగ్నీషియం లోపమా?


Tue,August 13, 2019 01:22 AM

పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుంది. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుంచి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం క్రియాశీలకంగా పనిచేస్తుంది.
Magnesium
మెగ్నీషియం తగ్గితే ఆకలి ఉండదు. తల తిరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. తిమ్మిర్లు వస్తాయి. శరీరం మొద్దుబారుతుంది. నొప్పులు విపరీతంగా ఉంటాయి. అయితే ఇవన్నీ సాధారణంగా అన్ని ఆరోగ్య సమస్యల్లోనూ కనిపించడం వల్ల మెగ్నీషియం లోపం అనే సందేహం రాదు. అందుకే ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మెగ్నీషియం సమపాళ్లలో తీసుకోవాలి. మితిమీరిన కాఫీ, ఆల్కహాల్, సోడా వంటివి తగ్గించాలి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే అది డీ విటమిన్‌ను శోషించదు. దీనివల్ల మెగ్నీషియం కొరత ఏర్పడుతుంది. తీపి పదార్థాలను అతిగా తిన్నా కూడా కిడ్నీల ద్వారా మెగ్నీషియం బయటకు పోతుంది. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, చేపలు, పెరుగు, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్స్ తింటే మెగ్నీషియం అందుతుంది.

69
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles