లోకమే ఫిదా అయింది!


Sun,August 11, 2019 01:47 AM

social-media-power
ఈ ఫొటోలో ఉన్న మహిళను గుర్తుపట్టారా? మూడు ఫ్రేముల్లో ఉన్నది ఒక్కరే. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే లైఫ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో అనడానికి ఈమె ఒక నిదర్శనం. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? ఈ ఫ్లాట్‌ఫాం గాయని పేరు రానుమండల్. తను మొన్నటి వరకూ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్‌లో భిక్షం ఎత్తుకొని బతికింది. ఇప్పుడు తన ప్రతిభతో టీవీ కార్యక్రమాల్లో పాడేందుకు సిద్ధమైంది. ఇంతకీ విషయమేంటంటే.. ఓ కొన్ని రోజుల క్రితం ప్రముఖ సీనియర్ గాయనీ, మ్యూజిక్ డైరెక్టర్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ నగ్మా అనే పాటను మండల్ అద్భుతంగా పాడింది. ఆమె పాట వింటుంటే లతా మంగేష్కర్ పాడిందా? అన్నట్టుగా ఉన్నది. ఆమె పాడుతుండగా వీడియో తీసి కొందరు Barpeta town అనే సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు.


social-media-power2
ఈ వీడియో పెట్టిన వెంటనే 20 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం 42 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 64 వేలకు పైగా కామెంట్లు, 60వేలకు పైగా షేర్లు సొంతం చేసుకున్నది మండల్ పాట. ఇలా తన టాలెంట్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. దీంతో ఏకంగా టీవీ ప్రేక్షుకుల ముందుకు వచ్చి మరోసారి తన పాటతో అలరించేందుకు రెడీ అయింది మండల్. ముంబైకి చెందిన ఓ ఎంటర్‌టైన్ టీవీ షోలో నిర్వహించబోయే మ్యూజిక్ రియాలిటీ షోలో మండల్ తన పాటను వినిపించబోతున్నది. మేకప్ రూంలో మండల్ మేకప్ వేసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
social-media-power3

936
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles